Share News

Telangana: పడితే రెస్ట్ తీసుకోకుండా తిడుతున్నాడు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్..

ABN , Publish Date - Mar 06 , 2024 | 08:39 PM

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్..

Telangana: పడితే రెస్ట్ తీసుకోకుండా తిడుతున్నాడు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్..
CM Revanth Reddy

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజాదీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు.

కేసీఆర్‌పై ఫైర్..

‘2009లో మనం కేసీఆర్‌ను గెలిపించి లోక్‌సభకు పంపాం. BRS పాలనలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? పాలమూరును దేశంలో ఆదర్శ జిల్లాగా ఆభివృద్ధి చేస్తా. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించండి. పాలమూరు పిల్గగాడు సీఎం అయ్యాడని కేసీఆర్‌లో అక్కసు ఉంది. ఇంట్లో పడితే కేసీఆర్ రెస్ట్ తీసుకోకుండా.. కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. కేసీఆర్ చిక్కుముళ్లను ఒక్కొక్కటిగా విప్పుతున్నాం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని పడగొడతానంటావా? పాలమూరు బిడ్డలు చదువుకోలేదా? పాలమూరు బిడ్డలు అగ్గి కణికలై పోరాడుతారు’ అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.

ఉద్యోగాల భర్తీ..

తమ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత 30 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెగా డీఎస్సీతో టీచర్ల నియామకానికి తెరలేపామన్నారు. అలాగే ప్రతి నెలా ఒకటవ తేదీనే ఉద్యోగులకు జీతాలు వేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.

గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు..

‘కాంగ్రెస్ పాలనపై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది. కార్యకర్తలే మనకు ముఖ్యం. కార్యకర్తల వల్లే మనం అధికారంలో ఉన్నాం. కాంగ్రెస్‌ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. 2006లో ప్రజల అండతో ZPTC అయ్యాను 2009, 2014లో కొడంగల్ ఎమ్మెల్యే అయ్యాను 2018లో మల్కాజిగిరిలో లోక్‌సభ సభ్యుడిని అయ్యాను. నాటి కష్టంతోనే నేను పీసీసీ చీఫ్ అయ్యా. పాలమూరు బిడ్డలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మోదీతో అయినా.. కేడీతో అయినా కొట్లాడుతా..

‘రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో అయినా.. కేడీతో అయినా కొట్లాడుతా. తెలంగాణ అభివృద్ధిపై మాత్రమే ప్రధానితో మాట్లాడాను. సీఎంగా నా బాధ్యత నిర్వర్తించాను. మర్యాద ఇవ్వడంలో మన సంస్కృతిని నిలబెట్టాను. నిధులు ఇవ్వకపోతే బీజేపీని చాకిరేవు పెట్టి ఉతికి ఆరేస్తా. కేంద్రంతో సంఘర్షణ వైఖరితో తెలంగాణకు నష్టం జరుగుతుంది. మోదీతో అయినా కేడీతో అయినా కొట్లాడుతాను. ప్రధాని హోదాలో పాలమూరుకు మోదీ ఏం ఇచ్చాడు?’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - Mar 06 , 2024 | 08:41 PM