Home » Twitter
చిన్న పిల్లల విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారిని కారులో బయటకు తీసుకెళ్లినపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా లాక్ అయిన కార్లలో ఉండిపోయి ప్రాణాలు కోల్పోయిన పిల్లల గురించి ఇటీవలి కాలంలో ఎక్కువ వార్తలు వస్తున్నాయి.
సాంకేతికత అందుబాటులోకి వచ్చాక ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం. సోషల్ మీడియా అలాంటి అద్భుతాలను, వింతలను అందరికీ చేరవేస్తోంది. తాజాగా హంగేరీలోని ఓ రోడ్డు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆ రోడ్డుమీద సరైన స్పీడులో వెళితే సంగీతం వస్తోంది.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి ఎంతోగానో వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. వెరైటీగా ఆలోచించి చుట్టుపక్కల వారికి షాకిస్తున్నారు.
ప్రస్తుతం ఓ వాట్సాప్ చాట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఓ ఉద్యోగి సెలవు కావాలంటూ చేసిన మెసేజ్ ఆ బాస్ కొంప ముంచింది. మహిళా ఉద్యోగి పంపించిన మెసేజ్ చదివిన భార్యకు ఎలా సర్ది చెప్పాలో తెలియక ఆ బాస్ తల పట్టుకున్నాడు. ఆ ఫన్నీ వాట్సాప్ మెసేజ్‌ల స్క్రీన్ షాట్ చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది.
జీవితంలో కోరుకున్నది సాధించాలనే తపన, పట్టుదల ఉంటే విజయం సాధించడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఏ పని చేస్తున్నా లక్ష్యంపై ధ్యాస ఉంటే దానిని చేరుకోవడం అసాధ్యమేమీ కాదు. ఈ మాటలను మీరు నమ్మడం లేదా? అయితే తమిళనాడుకు చెందిన జొమాటో డెలివరీ బాయ్ విఘ్నేష్ కథ తెలుసుకోవాల్సిందే.
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన వ్యాపార కార్యకలపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు కొంత సమయం కేటాయిస్తుంటారు. తనకు నచ్చిన వీడియోలను, విశేషాలను ఎప్పటికప్పుడు ట్విటర్లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహీంద్రా ఓ పెద్దాయన గురించి షేర్ చేశారు.
మార్చి 15న ఎలాన్ మస్క్ ట్విట్టర్ సీఈఓగా(Twitter CEO Elon Musk) బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనేక సంచలానత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించడం, బ్లూటిక్కు డబ్బులు వెచ్చించాల్సి రావడం, ట్వీట్లు చూసే విషయంలో, ట్వీట్లు పెట్టే విషయంలో పరిమితులు, ట్విట్టర్ వినియోగించాలంటే కచ్చితంగా లాగిన్ కావాలనే నిబంధనలు ఇలా అనేక కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ఇవి చాలవన్నట్టుగా ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ లోగేనే మార్చేశారు.
మనుషుల లాగానే వివిధ జంతువులు కూడా అద్భుతంగా అనుకరిస్తాయి. ముఖ్యంగా కుక్క, పిల్లి వంటి పెంపుడు జంతువులు తమ యజమానులను బాగా అనుకరిస్తాయి. ఎవరైనా శ్రద్ధగా ఏదైనా విషయం నేర్పితే చాలా త్వరగా నేర్చుకుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల ఓ యువకుడు షేర్ చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ ఫొటోపై నెటిజన్లు తమదైన వాదనలను వినిపిస్తున్నారు. @iffiViews అనే ట్విటర్ హ్యాండిల్లో ఓ యువకుడు తన హాస్టల్ రూమ్‌కు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు.
ప్రపంచవ్యాప్తంగా ట్విటర్ లోగో మారిపోయింది. ఎక్స్ హోల్డింగ్స్ కార్పొరేషన్ పేరిట గత మార్చిలో అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో మస్క్ ఓ కొత్త కంపెనీని స్థాపించారు. ‘ఎక్స్’ అనే దాన్ని కొన్నాళ్లుగా ఆయన ‘ఎవ్రిథింగ్ యాప్’గా వ్యవహరిస్తున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ రంగు కూడా నీలం నుంచి నలుపునకు మారిపోయింది.