Metro Train: మెట్రో రైల్లో ఒక్క సీటు కోసం ఇంత రచ్చా..? ఒక్కరితో మొదలయి.. చివరకు ఎంత మందితో గొడవయిందంటే..!

ABN , First Publish Date - 2023-08-04T15:34:04+05:30 IST

ఢిల్లీ వాసులు మెట్రో రైళ్లను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తుంటారు. రైళ్లలో డ్యాన్సింగ్, రొమాన్స్, స్టంట్లు మొదలైనవి చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సీటు గురించి ఇద్దరు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది.

Metro Train: మెట్రో రైల్లో ఒక్క సీటు కోసం ఇంత రచ్చా..? ఒక్కరితో మొదలయి.. చివరకు ఎంత మందితో గొడవయిందంటే..!

ఢిల్లీ (Delhi) వాసులు మెట్రో రైళ్లను కేవలం ప్రయాణాల కోసమే కాకుండా రకరకాల పనుల కోసం ఉపయోగిస్తుంటారు. రైళ్లలో డ్యాన్సింగ్, రొమాన్స్, స్టంట్లు మొదలైనవి చేసి వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా సీటు గురించి ఇద్దరు మహిళల మధ్య చిన్నగా మొదలైన గొడవ చాలా పెద్దదిగా మారిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

@priyarajputlive అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక మహిళ మెట్రోలో (Delhi Metro) కూర్చుని ఉంది. ఇంతలో అక్కడకు ఓ మహిళ తన కూతురితో కలిసి వచ్చింది. ఆ మహిళను పక్కనే ఖాళీగా ఉన్న సీటులోకి జరగాలని కోరింది. అందుకు ఆ మహిళ నిరాకరించడంతో గొడవ మొదలైంది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. బూట్లతో కొడతా అని హెచ్చరించడం వరకు వెళ్లింది. ఎంత మంది చెబుతున్నా ఆ మహిళ మాత్రం గొడవ ఆపడం లేదు (Women fights about seat).

Viral Video: రీల్స్ తెచ్చిన తంటా.. ఓ చేత్తో అమ్మాయి చేయి.. మరో చేతిలో గులాబీ పట్టుకుని రీల్స్ స్టార్ట్.. మరుక్షణంలోనే..

ఈ ఘటన మొత్తాన్ని ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 53 వేల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ``ఈ మధ్య చాలా మందికి చిన్న విషయాలకే కోపం వచ్చేస్తోంది``, ``పాపం.. ఆ పాప సైలెంట్‌గా చూస్తూ ఉండిపోయింది``, ``భారత్‌లో ఇలాంటి వాళ్లు అన్ని చోట్లా ఉంటారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-04T15:34:04+05:30 IST