Snake vs Cow: పొలంలో తిరుగుతున్న ఆవుకు ఎదురుపడిందో పాము.. చివరకు జరిగిందో షాకింగ్ సీన్..!

ABN , First Publish Date - 2023-08-04T16:27:18+05:30 IST

సాధారణంగా వేర్వేరు జాతుల జంతువుల మధ్య సఖ్యత ఉండదు. ఎదురుపడినపుడు అవి గొడవపడేందుకు ప్రయత్నిస్తాయి. బలమైన జంతువు బలహీనమన దానిని భయపెట్టి తరిమేస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మాత్రం షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పాము, ఆవు ఎదురుపడ్డాయి.

Snake vs Cow: పొలంలో తిరుగుతున్న ఆవుకు ఎదురుపడిందో పాము.. చివరకు జరిగిందో షాకింగ్ సీన్..!

సాధారణంగా వేర్వేరు జాతుల జంతువుల మధ్య సఖ్యత ఉండదు. ఎదురుపడినపుడు అవి గొడవపడేందుకు ప్రయత్నిస్తాయి. బలమైన జంతువు బలహీనమైన దానిని భయపెట్టి తరిమేస్తుంది. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే మాత్రం షాక్ అవక తప్పదు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఒక పాము (Snake), ఆవు (Cow) ఎదురుపడ్డాయి. తర్వాత ఏం జరిగిందో చూస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే (Snake Videos).

ఈ వీడియోను IFS అధికారి సుశాంత నంద ట్విటర్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ నాగు పాము దగ్గరకు ఓ అవు వచ్చింది. ఆ రెండూ ఎదురెదురుగా నిల్చున్నాయి. ఆ తర్వాత రెండింటి మధ్య పోరు జరుగుతుందనుకుంటే రెండూ ఒకదానిపై మరొకటి ప్రేమను, ఆప్యాయతను కురిపించుకున్నాయి (Cow and snake friendship). ఆ పామును ఆవు తన నాలుకతో ప్రేమగా నిమిరింది. ఈ వీడియో చూసి చాలా మంది షాకవుతున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సుశాంత నంద ``దీనిని వివరించడం కష్టం. స్వచ్ఛమైన ప్రేమతో నమ్మకం ఏర్పడింది`` అని కామెంట్ చేశారు.

Rare Transparent Fish: ఇలాంటి చేపను ఎక్కడా చూసుండరు.. కళ్లు తప్ప ఆ చేపకు మిగతా అవయవాలు లేవా..?

ఈ వీడియోను 4 లక్షల మందికి పైగా వీక్షించారు. ఆరు వేల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``నమ్మలేకపోతున్నా. ఇది నిజమేనా``, ``నాగరాజుతో ఆవు ప్రేమలో పడిందేమో``, ``మనం అందుకే ఆవును తల్లితో పోలుస్తాం``, ``దీనిని నమ్మలేకపోతున్నా. ఎందుకంటే మా ఆవు పాము కాటు వల్లే చనిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - 2023-08-04T16:27:18+05:30 IST