Ganta Srinivasa Rao: రాజకీయ కక్షలతో రాజధాని నిర్మాణాన్ని నాశనం చేశారు..

ABN , First Publish Date - 2023-08-03T15:43:49+05:30 IST

విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ట్విట్టర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి తాము చెబుతున్నా సీఎం జగన్ మూర్కత్వంగా ముందుకేళితే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయన్నారు.

Ganta Srinivasa Rao: రాజకీయ కక్షలతో రాజధాని నిర్మాణాన్ని నాశనం చేశారు..

విశాఖ: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ట్విట్టర్ (Twitter) వేదికగా జగన్ ప్రభుత్వం (Jagan Govt.)పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి తాము చెబుతున్నా సీఎం జగన్ (CM Jagan) మూర్కత్వంగా ముందుకేళితే ఇలాంటి ఎదురు దెబ్బలే తగులుతాయన్నారు. ‘‘మీ స్వార్ధ పూరిత రాజకీయ కక్షలతో రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణాన్ని నాశనం చేశారు.. అమాయకమైన రైతుల జీవితాలతో ఆడుకోవాలని చూశారు.. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ (Master Plan)లో ఎలక్ట్రానిక్ సిటీ (Electronic City)గా పేర్కొన్న ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి కనీస పరిజ్ఞానం లేకుండా ఆర్‌-5 జోన్‌ (R-5 Zone)లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలన్నా మీ మూర్కత్వ ప్రయత్నాలను ఈరోజు హైకోర్టు (High Court) తప్పు పట్టి స్టే విధించి.. అమరావతిలో ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసి చెంప చెళ్లుమనిపించింది... మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పేదల పక్షాన నిలిచి పట్టాలు ఇవ్వదల్చుకుంటే ఆర్‌-5 జోన్‌ పరిధిలోలేని వాటిని ఇచ్చి మీ విశ్వసనీయత చాటుకోoడి.. అంతే కానీ పేదల సంక్షేమం ముసుగులో అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను ధ్వంసం చెయ్యకండి... చట్టాలు మీకు చుట్టాలు కావనే సత్యాన్ని గ్రహించి ఇప్పటికైనా నెత్తికెక్కిన మీ కళ్ళను కిందకు దించండి’’ అంటూ గంటా శ్రీనివాసరావు ట్వీట్ చేశారు.

Updated Date - 2023-08-03T15:43:49+05:30 IST