Home » TwitterX
ఈవీఎంలపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ (Minister Nara Lokesh) కౌంటర్ ఇచ్చారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు గెలిస్తే ఈవీఎం(EVM)లు బాగా పని చేసినట్లు, 2024లో ఓడిపోతే ఈవీఎంలపై నింద మోపుతావా? అంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
సాధారణంగా ఆస్తులు, స్థలాలు, వస్తువులను వేలం పాట వేయడం అందరికీ తెలిసే ఉంటుంది. కానీ రూ.10 నోట్లను వేలంపాట వేయడం ఎక్కడైనా చూశారా ? కనీసం విన్నారా? కానీ ఇప్పుడు అదే జరుగుతోంది. రెండు రూ.10 నోట్లకు లక్షలు పలుకుతున్నాయి.
వాట్సప్ భద్రత విషయంలో ఎలాన్ మస్క్(Elon Musk) చేసిన ఆరోపణలను వాట్సప్ (WhatsApp) చీఫ్ విల్ క్యాత్‌కార్ట్ ఖండించారు. వాట్సప్.. వినియోగదారుల భద్రత విషయంలో రాజీపడబోదని స్పష్టం చేశారు. ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్‌పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే తన ఎక్స్ అకౌంట్లో రాసుకొచ్చారు.
సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విటర్ ఇక పూర్తిగా ‘ఎక్స్’గా మారిపోయింది. ట్విటర్ పేరును ఎక్స్‌గా మారుస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలన్ మస్క్ గతంలోనే ప్రకటించి లోగోను మార్చినా..
బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27న 24 వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఇన్నాళ్లు ఫేస్ బుక్‌కే పరిమితమైన కేసీఆర్ ఇవాళ సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ ఫాంలైన ఎక్స్, ఇన్ స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇకపై సోషల్ మీడియాని ఫుల్‌గా వాడేసుకోవడానికి రెడీ అయిపోయారన్నమాట.
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఏఐ(AI) టెక్నాలజీ అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. దీని ప్రభావం ప్రధానంగా సాఫ్ట్‌వేర్ రంగంపై పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(X) భారత్‌లోని 2 లక్షల మందికి పైగా యూజర్ల అకౌంట్లను తొలగించింది. లైంగిక దాడులు, పోర్నోగ్రఫి, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఒక నెల వ్యవధిలో ఏకంగా 2 లక్షల12 వేల 627 ఖాతాలను నిషేధించింది.
పెంపుడు జంతువులు చూపించే ప్రేమ, వాటి అల్లరి చూడముచ్చటగా ఉంటుంది. పెంపుడు జంతువుల్లో విశ్వాసం.. అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి శునకాలే. జంతువుల్లో ఇవి ఉన్నంత విశ్వాసంగా వేరేవి ఉండవు. నాగరికత తెలియక ముందు నుంచే మనుషులకు శునకాలు మంచి స్నేహితులుగా ఉండేవి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో శనివారం నుంచి "క్లిక్ హియర్"(Click Here) అనే ట్రెండ్ నడుస్తోంది. ఎక్స్ ప్లాట్‌ఫాంని మీరూ వాడుతున్నట్లైతే క్లిక్ హియర్ అనే పదాలు రాసి ఉన్న ఫొటోలు మీకు కనిపించే ఉంటాయి. ఇందులో నలుపు రంగులో పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్‌లో ‘క్లిక్ హియర్’ అని రాసి ఉంటుంది.
సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ప్లాట్‌ఫాం తాజాగా దాని "కమ్యూనిటీ" విభాగం కోసం కొత్త ఫీచర్‌ని అభివృద్ధి చేస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే కమ్యూనిటీల అడ్మిన్లు ఇకపై అడల్ట్ కంటెంట్‌ను కూడా పోస్ట్ చేయొచ్చు. ఇందుకోసం 'నాట్ సేఫ్ ఫర్ వర్క్' (NFSW)ని ప్రారంభించే పనిలో ఎక్స్ ఉన్నట్లు తెలుస్తోంది.