Home » Union Budget 2024-25
వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య (MP Kadiam Kavya) పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అంకెల గారడి చేస్తూ పబ్బం గడుపుతోందని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో వైద్య ఆరోగ్య పద్దులపై శుక్రవారం పార్లమెంట్లో కాంగ్రెస్ పక్షాన ఎంపీ డాక్టర్ కడియం కావ్య చర్చలో పాల్గొన్నారు.
ఈనెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో విపక్ష పాలిత రాష్ట్రాలపై నిర్లక్ష్యం చూపారంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. ఏ రాష్ట్రానికి కూడా నిధులు నిరాకరించలేదని చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్ చేశారు.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక ప్రగతి సాధించేలా 2024-25 బడ్జెట్ ఉందని కేంద్ర మంత్రి మురగన్ అన్నారు. శనివారం నాడు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి కేంద్రమంత్రి పూలమాల నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మురగన్ మాట్లాడుతూ... వికసిత్ భారత్ లక్ష్యంగా మన బడ్జెట్ ఉందన్నారు. ప్రధాన మంత్రి మోదీ ముందు చూపుకు ఈ బడ్జెట్ నిదర్శనమన్నారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీకి ఒరిగిందేమీ లేదని రాజ్యసభలో విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తెలిపారు. బడ్జెట్లో ఏపీకి ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు.
మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నయవంచనకు గురి చేసిందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ నాగరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని నిప్పులు చెరిగారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయాయన్నారు. శాంతి భద్రతలు సైతం క్షీణించాయని తెలిపారు.
వైసీపీ అధినేత జగన్ ఢిల్లీ పర్యటన చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్-2024లో ఎన్డీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల విపక్ష చూపించారంటూ విపక్షాల విమర్శల నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ఇష్టాయిష్టాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపితే ఒంటరిగా మిగిలిపోతారని హెచ్చరించారు.
బడ్జెట్లో రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం అన్యాయం చేసిందని.. రాష్ట్రంపై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని రేవంత్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ శాసనసభలో జరిగిన చర్చపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.