Share News

Telangana: నీలా నేను బానిసను కాదు.. రేవంత్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం..

ABN , Publish Date - Jul 24 , 2024 | 07:41 PM

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

Telangana: నీలా నేను బానిసను కాదు.. రేవంత్‌పై కిషన్ రెడ్డి ఆగ్రహం..
Revanth Reddy and Kishan Reddy

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌పై రేవంత్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఢిల్లీలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎంపీ పదవిలో ఉండాలనేది సికింద్రాబాద్ ప్రజల నిర్ణయమని.. తాను పదవిలో ఉండాలా లేదా అనేది తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారన్నారు. రేవంత్ రెడ్డి తనకు పదవి ఇవ్వలేదని ఎద్దెవా చేశారు. తన చివరి శ్వాస వరకు కమలం జెండా పట్టుకుంటానని.. బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను ఎవరికీ బానిసను కాదని.. వ్యక్తుల కోసం తాను రాజకీయం చేయడం లేదన్నారు. పార్టీకి, పార్టీ సిద్ధాంతానికి మాత్రమే తాను బానిసనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రేవంత్‌లా తాను సోనియాగాంధీ బానిసను కాదని.. చివరి వరకు బీజేపీ జెండానే పట్టుకుంటానని తెలిపారు.

BRS: ఇప్పటి వరకు ఆ చెక్కు బస్ భవన్‌కు చేరలేదు: హరీష్ రావు


అది మీ నినాదమే..

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. కుర్చీ బచావో బడ్జెట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. కుర్చీ బచావో అనేది కాంగ్రెస్ నైజమని.. కుర్చీని కాపాడుకోవడం కోసం రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. రేవంత్ తనకు సుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి ఎన్నో విధాలా సాయం చేస్తోందని.. భవిష్యత్తులోనూ సాయం కొనసాగుతుందన్నారు. కనీస అవగాహన లేకుండా బడ్జెట్‌లో తెలంగాణకు ఏమి లేదంటే కేంద్రప్రభుత్వాన్ని తిట్టడం సరికాదన్నారు. కేంద్రాన్ని తిట్టడానికి అసెంబ్లీని కేంద్రంగా చేసుకున్నారని ఆరోపించారు.

TS Assembly: కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్... ఏ విషయంలో అంటే?


ధర్నా చేస్తారా..

బడ్జెట్‌కు వ్యతిరేకంగా ధర్నా చేస్తామని చెప్పడానికి రేవంత్‌కు నోరు ఎలా వచ్చిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఢిల్లీకి రాగానే చెక్కులు రాసిస్తారా అన్నారు. దీక్ష చేసినంత మాత్రాన తెలంగాణకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. తెలంగాణలో సైనిక్ స్కూల్ రాకపోవడానికి కారణం ఎవరో రేవంత్ రెడ్డినే చెప్పాలన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారని.. అక్కడ ఐరన్ ఓర్ సరిగ్గాలేదన్నారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ ఎందుకు పెట్టలేదో కేసీఆర్‌ను ఎప్పుడైనా అడిగారా అంటూ ప్రశ్నించారు. ప్రధాని మోదీ భూముల వ్యాపారం చేయడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు.

Telangana: కొంచెం ఓపిక పట్టండి.. రేవంత్‌కు అసహనం ఎందుకో అర్థం కావడంలేదన్న కేటీఆర్..


రేవంత్ ఏమన్నారంటే..

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని.. రాష్ట్రం నుంచి 8మంది ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. ఇద్దరు కేంద్రమంత్రులు తెలంగాణ నుంచి ఉన్నా ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగినందుకు తక్షణమే ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.


TS News: తమను వెదకొద్దంటూ లెటర్ రాసి పెట్టి ఇంటి నుంచి వెళ్లిపోయిన అక్కాతమ్ముళ్లు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Telangana News and Latest Telugu News

Updated Date - Jul 24 , 2024 | 07:42 PM