LokSabha: జగన్ పాలనపై నిప్పులు చెరిగిన ఎంపీ నాగరాజు
ABN , Publish Date - Jul 25 , 2024 | 08:41 PM
మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నయవంచనకు గురి చేసిందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ నాగరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని నిప్పులు చెరిగారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయాయన్నారు. శాంతి భద్రతలు సైతం క్షీణించాయని తెలిపారు.
న్యూడిల్లీ, జులై 25: మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నయవంచనకు గురి చేసిందంటూ వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ నాగరాజు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందని నిప్పులు చెరిగారు. గత అయిదేళ్లలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ కుప్ప కూలిపోయాయన్నారు. శాంతి భద్రతలు సైతం క్షీణించాయని తెలిపారు. జగన్ పాలనలో ఆర్థికంగా దివాళ తీసిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని ఆయన స్పష్టం చేశారు.
Also Read: Amritpal Singh: దేశంలో ప్రతీ రోజు అప్రకటిత ఎమర్జెన్సీ.. ఎంపీని నిర్బంధిస్తారా..?
రాజధాని, పోలవరంకు నిధులు కేటాయింపు..
గురువారం లోక్‌సభలో కర్నూలు ఎంపీ నాగరాజు మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. 2014 -19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌ను 72% మేర పూర్తి చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
Also Read: Minority welfare: ప్రధాని మోదీని మించిన సీఎం రేవంత్
దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఏపీ..
దేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అటువంటి రాష్ట్ర రాజధానికి కేంద్రం నిధులు కేటాయిస్తే విపక్షాలు ఆందోళన చేయడం బాధాకరంగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడం చాలా అవసరమని చెప్పారు. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ని బీహార్, ఆంధ్ర బడ్జెట్‌గా విపక్షాలు అభివర్ణించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
Also Read: PM Modi: అమిత్ షాతో అజిత్ భేటీ.. కొద్ది గంటలకే.. బీజేపీలో కీలక పరిణామం
ఏపీని దివాళా అంచున నిలిపిన జగన్..
ఓ వైపు రాజధాని లేదు, మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని.. అటువంటి రాష్ట్రానికి నిధులు కేటాయిస్తే విపక్షాలు ఇటువంటి వ్యాఖ్యలు చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో పాలించిన ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాళా అంచున నిలిపిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని కేంద్ర బడ్జెట్‌లో పేర్కొనడాన్ని ఆయన స్వాగతించారు.
Also Read: AP Assembly: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఏపీని బాగు చేసేది సీఎం చంద్రబాబు మాత్రమే..
రాష్ట్రాన్ని బాగు చేసేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో రాజధాని అమరావతి పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే తాను తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టడానికి కారణమైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూత్ ఐకాన్ నారా లోకేష్‌కు పార్లమెంట్ సాక్షిగా కర్నూలు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!
సీఎం బాబు, మంత్రి లోకేశ్‌కు అభినందనలు..
భారత్ ఔన్నత్యాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని చెప్పారు. ఆయన సారథ్యంలో దేశం బాగుండాలని ముచ్చటగా మూడవ సారి ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. అందుకు ప్రధాని మోదీకి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని తెలిపారు. ఇక కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ అంశాలు ప్రస్తావించినందుకు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్నూలు ఎంపీ నాగరాజు అభినందించారు.
Also Read: Delhi High Court: ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా కోర్టు కీలక ఆదేశాలు.. కదిలిన మోదీ సర్కార్
Read Latest AP News and Telugu News