Home » Uttam Kumar Reddy Nalamada
వరిసాగులో దేశంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని, వరి విస్తీర్ణం కొంతకాలంగా గణనీయంగా పెరుగుతోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. నిన్నటి వరకూ పార్లమెంట్ ఎన్నికలతో కోడ్ ఉండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై రివ్యూ సాధ్యం కాలేదని తెలిపారు.
రుతు పవనాల ప్రభావంతో రాష్ట్రమంతటా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఎన్డీఎ్సఏ మధ్యంతర నివేదిక ప్రకారం మరమ్మతు పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకోవడానికి శుక్రవారం ప్రాజెక్టును మంత్రి ఉత్తమ్ సందర్శించనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. 7న అన్నారం, 8న సుందిళ్ల బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈనెల 10వ తేదీలోపు బ్యారేజీలకు మరమ్మతులు/పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. నిపుణుల కమిటీ కూడా ఇప్పటికే బ్యారేజీలను పరిశీలించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాక్షాత్తూ హైకోర్టు జడ్జి జస్టిస్ కాజా శరత్ ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని ఓ నిందితుడు (ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు) తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వార్తలు గుప్పుమన్న నేపథ్యంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా.. జూన్ 2న ఉదయం 10:35 గంటలకు రాష్ట్ర గీతమైన ‘జయజయహే తెలంగాణ’ను ప్రభుత్వం జాతికి అంకితం చేయనుంది. మూడు చరణాలతో కూడిన రెండున్నర నిమిషాల వెర్షన్‌ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు. 10:35 గంటలకు మొదలుపెట్టి.. 10:37:30 సెకన్ల వరకూ ఈ గీతాన్ని వినిపించనున్నారు. దీంతోపాటు.. 13:30 నిమిషాల నిడివిగల పూర్తిగీతాన్ని కూడా సర్కారు ఓకే చేసింది.
పౌరసరఫరాల శాఖలో ధాన్యం టెండరు ప్రక్రియలో రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ‘‘టెండరు నిబంధనల ప్రకారం.. మిల్లర్ల వద్ద నిల్వ ఉన్న 35లక్షల టన్నుల ధాన్యాన్ని కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు తరలించాలి.
‘‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని తొందరగా ఓవర్ టేక్ చేయాలని ఆ పార్టీ శాసనసభా పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి ఉండొచ్చు! అందుకోసం మాపై అడ్డగోలుగా మాట్లాడితే ఎట్లా? రూ.1.30 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోళ్లలో రూ.వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని మాట్లాడుతున్నడు.
బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర రెడ్డిపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను తామే పెంచి పోషించామని అన్నారు. ఆయన అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓవర్ టేక్ చేయాలని మహేశ్వర రెడ్డి భావిస్తున్నారని అన్నారు.
రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రైతన్నల నుంచి సేకరించిన ధాన్యంపై కన్ను వేసి అవినీతి దందాకు ఈ సర్కార్ తెర తీసిందని ఆయన ఆరోపించారు.