Share News

Minister Uttam Kumar: ఈనెల 20న ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎందుకంటే..?

ABN , Publish Date - Jul 17 , 2024 | 03:48 PM

ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఈనెల 20 వ తేదీన వెళ్లనున్నారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ కానున్నారు. మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజ్‌లపై ఎన్టఎస్‌ఏతో ఉత్తమ్ చర్చించనున్నారు.

Minister Uttam Kumar: ఈనెల 20న ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎందుకంటే..?
Minister Uttam Kumar Reddy

హైదరాబాద్: ఢిల్లీకి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఈనెల 20 వ తేదీన వెళ్లనున్నారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ కానున్నారు. మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజ్‌‌లపై ఎన్డీఎస్‌ఏతో ఉత్తమ్ చర్చించనున్నారు. ఎన్డీఎస్ఏ అధికారులతో పలు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన విషయాలపై ఆరా తీయనున్నారు. వర్షాల నేపథ్యంలో డ్యామ్‌ల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈరోజు( బుధవారం) మంత్రి ఉత్తమ్ మీడియాకు వెల్లడించారు.


ALSO Read: KTR: సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేటీఆర్

రూ. 28 వేల కోట్లను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు తెలిపారు. రూ.18 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల ఇంట్రెస్ట్‌కి పోతున్నాయని తెలిపారు. ఈ వర్క్స్ ఎక్స్‌పెండిచర్ కోసం రూ.11 వేల కోట్ల బడ్జెట్‌లో పెట్టాలని ఆర్థిక శాఖని కోరుతున్నామని అన్నారు. 2025 డిసెంబర్ 25 వరకు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. డిండి కూడా తమ ప్లాన్‌లో ఉందని వివరించారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి బడ్జెట్‌ వేసి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌కి పంపుతున్నామని అన్నారు. సమ్మక్క ప్రాజెక్ట్ కోసం ఛత్తీస్‌గఢ్‌తో ల్యాండ్ కోసం సంప్రదింపులు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.


ALSO Read: CM Revanth: కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతిపై సీఎం రేవంత్ స్పందన

అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బ్యారేజీకి సంబంధించిన ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై పలు అంశాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. భారీవర్షాలు పడితే ప్రాజెక్ట్‌లకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish Rao: ఆ ఎమ్మెల్యేలను మాజీలను చేసేవరకు నిద్రపోం..

Danam Nagender: ఖైరతాబాద్ మహా గణపతి కొత్త ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశాం..

Phone tapping Case: జూబ్లీహిల్స్‌ పోలీసుల కస్టడీకి రాధాకిషన్‌రావు

Read Latest TG News And Telugu News

Updated Date - Jul 17 , 2024 | 04:07 PM