Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై NDSA కీలక సమావేశం..
ABN , Publish Date - Jul 20 , 2024 | 01:45 PM
Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) కీలక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది మే 5వ తేదీన ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్‌ఏ..
Kaleshwaram Lift Irrigation Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యాం భద్రతా అథారిటీ (NDSA) కీలక సమావేశం నిర్వహించింది. ఈ ఏడాది మే 5వ తేదీన ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్‌ఏ.. వర్షాకాలం, వరదలు రాకముందే జులై మొదటి వారంలోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో పేర్కొంది. NDSA సూచనలతో.. జూన్ రెండో వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ రెండు సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్ట్‌లు ప్రక్రియ నిలిచిపోయింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ విచారణ జరుపుతోంది. ఈ కమిషన్ త్వరగా నివేదిక ఇవ్వాలంటూ NDSAని కోరింది. ఆ నివేదిక ఆధారంగానే తాము తుది నివేదిక ఇవ్వాలని పేర్కొంది. ప్రాజెక్టును కొనసాగించడమా! కొత్త నిర్మాణానికి వెళ్లాడమో సిఫార్సులు చేయాల్సి ఉందన్న కమిషన్ తెలిపింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి తగిన సమాచారం లేకపోవడంతో తాము నివేదిక ఇవ్వలేకపోతున్నట్లు కమిషన్‌కు తెలిపింది NDSA బృందం. ఈ నేపథ్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని NDSAని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ మేరకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపారు NDSA చైర్మన్. శనివారం మధ్యాహ్నం జరిగే ఈ భేటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.