Home » Uttam Kumar Reddy Nalamada
Telangana: యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి సన్నిధిలో బ్రహోత్సవాలు ఘనం జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. రేవంత్‌కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం దంపతులు, మంత్రుల బృందం పాల్గొన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీన కుంగిపోయిందని.. ఈ విషయాలను ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి వివరించామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. బుధవారం నాడు సచివాలయంలో నిపుణుల కమిటీకి కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Telangana: ఎల్ఆర్ఎస్పై(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరుబాటకు దిగింది. మార్చి 6న అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది. 7న జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.
Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ బయలుదేరిన బీఆర్ఎస్ కాన్వాయ్‌లోని ఓ బస్సు టైర్ పగడంతో చిన్న అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్తున్న బస్సు టైర్ పగిలింది అని చూశా. కారు టైర్లు అన్నీ మిగిలిపోయాయి. ఇక షెడ్డుకు పోవాల్సిందే’’ అంటూ మంత్రి సెటైరికల్ కామెంట్స్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రాజెక్టులపై అధికార.. విపక్షాల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. పదేళ్లలో ఇరిగేషన్ శాఖను బీఆర్ఎస్ భ్రష్టు పట్టించిందని సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని పబ్బం గడిపారని ఎద్దేవా చేశారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో విచారణ జరిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు ఆరోరోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నారు.
రేపు(మంగళవారం) మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరూ రావలని ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Kumar Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారని తెలిపారు.
వికారాబాద్ జిల్లా: పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దేవాదాయశాఖ ఆధీనంలోకి ఎండోమెంట్ అధికారులు తీసుకున్నారు. ఆలయం స్వాధీనంతో స్థానికంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య రాజకీయ రగడ నెలకొంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజాభవన్‌లో ఆదివారం ప్రత్యేక సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.