TS NEWS: 13న మేడిగడ్డ సందర్శనకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఆహ్వానం
ABN , Publish Date - Feb 12 , 2024 | 07:29 PM
రేపు(మంగళవారం) మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరూ రావలని ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Kumar Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారని తెలిపారు.
హైదరాబాద్: రేపు(మంగళవారం) మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు అందరూ రావాలని తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Kumar Reddy) తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు కూడా వస్తున్నారని తెలిపారు. రేపు ఉదయం 10.05 గంటలకు అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు బయలుదేరుతామని తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రాజెక్టు వద్దకు చేరుకుంటామని అన్నారు. సుమారు 2 గంటల పాటు కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్, మిగతా వాటిని కూడా పరిశీలిస్తామని చెప్పారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌కు తిరిగి వస్తామని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్‌తో పాటు ప్రతి ఎమ్మెల్యేకు లేఖ రాశానని తెలిపారు. ఎమ్మెల్యేలు ప్రాజెక్టుపై చేసిన సూచనలు, సలహాలను ప్రభుత్వం ఖచ్చితంగా స్వీకరిస్తుందని అన్నారు. తెలంగాణకు రావాల్సిన కేటాయింపులపై పోరాడతామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.