Home » Vallabhaneni Vamsi Mohan
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ త్వరలో అరెస్ట్ కాబోతున్నారా..? ఇందుకు సంబంధించి రంగం సిద్ధమైందా..? అంటే తాజా పరిణామాలను చూస్తే ఇదే నిజమనిపిస్తోంది..
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ {Vallabhaneni Vamsimohan) నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు (Yarlagadda Venkatarao) స్పందించారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ(Vallabaneni Vamsi) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంశీ నివాసం వద్ద టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఆందోళన చేపట్టారు. వంశీకి చెందిన వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పోలీసు బలగాలపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు.
గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ భాగోతాలు ఒక్కొక్కటిగా భయటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో గన్నవరం మండలం సూరంపల్లి, ముస్తాబాద్, కేసరపల్లి మేజర్ పంచాయతీల్లో ఆయన ఓట్ల రిగ్గింగుకు ప్రయత్నించారు. దీన్ని కూటమి శ్రేణులు సమర్థవంతంగా తిప్పికొట్టారు.
గన్నవరం మే 25: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, మరుసటి రోజు వైసీపీ చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే మాచర్ల, తిరుపతి, తాడిపత్రి ఘటనలు వీడియోలతో సహా బయటకు రాగా తాజాగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వంశీ దాడులకు సంబంధించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. కేసరపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పొట్లూరి బసవరావు ఇంటిపై వంశీ దాడి చేయగా.. స్థానిక యువత, గ్రామస్థులు ఆయన్ను పరిగెత్తించిన విషయం వైరల్‌గా మారింది.
ఏపీలో ఎన్నికలు మాత్రమే జరిగాయి.. ఇంకా ఫలితాలు రాలేదు. ఏ పార్టీ గెలుస్తుందనేది జూన్-04న తేలిపోనుంది. ఈ గ్యాప్‌లో గన్నవరం వల్లభనేని వంశీ.. అమెరికా చెక్కేశారు. అసలు ఆయన అమెరికా ఎందుకెళ్లారు.. ఈ టూర్ వెనుక ఉన్న షాకింగ్ విషయాలేంటి..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అమెరికా వెళ్లారు. వాస్తవానికి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అమెరికా వెళ్లడం పెద్ద సంచలనం కలిగించే అంశమేమీ కాదు. అయితే వంశీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఆయన ఏ అడుగు వేసినా అది చర్చనీయాంశంగా మారుతోంది...
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
అంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరుగుతున్న పోలింగ్ వేళ.. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ వెంకట్రావు విజయం ఖాయమైందని అందరికి అర్థమైపోయింది. ఆ క్రమంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి వల్లభనేని వంశీ అనుచరులు రెచ్చిపోయారు. సురంపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ పరిశీలిస్తున్న యార్లగడ వెంకట్రావుపై వారు దాడికి పాల్పడ్డారు.