Home » VANGALAPUDI ANITHA
Andhrapradesh: తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న జగన్ చెప్పినవన్నీ కుంటి సాకులే అంటూ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు చేశారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తన తల్లికీ, చెల్లికి పట్టిన గతే తనకూ పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారన్నారు. డిక్లరేషన్ ఇవ్వటం ఇష్టం లేక డైవర్షన్ రాజకీయాలు చేసింది జగనే అంటూ మండిపడ్డారు.
అక్రమంగా కేసులు బనాయించి వేధించిన వారిపై చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత హెచ్చరించారు. ముంబయి సినీ నటి కాదంబరి జత్వాని కేసుపై ఆమె స్పందించారు. నటి కాదంబరి ఆన్లైన్లో ఫిర్యాదు చేశారన్నారు.
రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ముగ్గురు మృతిచెందగా.. దాదాపు 25మందికి తీవ్రగాయాలు అయ్యాయి. మృతులు పూడి మోహన్ (20), సీహెచ్ హారిక(22), వై.చిన్నారావు(32)గా గుర్తించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అలాగే గాయపడిన క్షతగాత్రులను హుటాహుటిన అనకాపల్లిలోని పలు ఆస్పత్రులకు తరలించారు.
వైసీపీ(YSRCP) పాలనలో సీఎం చంద్రబాబుని (CM Chandrababu Naidu) ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) అన్నారు.
విజయవాడలో సైబర్ నేరాలకు వ్యతిరేకంగా నగర పోలీసులు చేపట్టిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ వాక్ థాన్కు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకే పోలీసులు మారథాన్ నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు.
సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్ వివేకా హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి సునీత తీసుకెళ్లారు. జగన్ ప్రభుత్వంలో తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయం గురించి అనితకు ఆమె వివరించారు.
ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో ఏర్పాటు చేసిన "హ్యాండ్లూమ్ శారీ వాక్"ను ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. కార్యక్రమంలో వెయ్యి మీటర్ల చేనేత చీర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక చీరకట్టులో మహిళలు చేసిన వాక్ పలువురిని ఆకర్షించింది.
రాష్ట్రంలో శాంతిభద్రతలు, గంజాయి నిర్మూలన అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) సమీక్ష నిర్వహించినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) చెప్పారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి, విజయనగరం జిల్లా రామభద్రాపురంలో జరిగిన హత్యాచారం, అత్యాచార ఘటనలు అత్యంత హేయమని హోంమంత్రి అన్నారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో బాలికను హత్యచేసిన నిందితుడ్ని వదిలిపెట్టేది లేదని హోంశాఖా మంత్రి వంగలపూడి అనిత స్పష్టంచేశారు.
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను శనివారం దారుణంగా హత్య చేసిన నిందితుడు బోడా బత్తుల సురేశ్ (26) కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.