Share News

Anitha: గత ప్రభుత్వం తప్పిదం వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో ఈ పరిస్థితి: అనిత

ABN , Publish Date - Jan 05 , 2025 | 11:57 AM

Visakhapatnam: రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్‌ జైల్‌ను సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Anitha: గత ప్రభుత్వం తప్పిదం వల్లే విశాఖ సెంట్రల్ జైల్లో ఈ పరిస్థితి: అనిత

విశాఖ: రాష్ట్ర హోం మంత్రి (Home Minister) వంగలపూడి అనిత (Vangalapudi Anitha) ఆదివారం ఉదయం విశాఖ సెంట్రల్‌ జైల్‌ను సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. విశాఖ సెంట్రల్ జైల్లో (Visakhapatnam Central Jail) గంజాయి సరఫరా(Cannabis supply) ఆరోపణలు వచ్చాయని, పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తప్పిదాల వలనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ఖైదీల రక్షణే ముఖ్యమని అన్నారు. ఇటీవలే జైల్లో సెల్ ఫోన్లు బయటపడ్డాయని, సెల్ ఫోన్లు బయటపడిన చోట కూడా పరిశీలించామని, విచారణ అనంతరం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్‌లో ఎవరు ఎవరుతో మాట్లాడారో తెలుసుకుని వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


జైల్‌లో గంజాయి మొక్క

జైల్‌లో గంజాయి మొక్క కనిపించిందని, విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని, ఎవ్వరిని ఉపేక్షించేది లేదని హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ చేసిన తర్వాతే విశాఖ సెంట్రల్ జైల్‌లో ఉద్యోగులను బదిలీలు చేస్తామని, ఇప్పటి వరకు ఎవ్వరిని సస్పెండ్ చేయలేదని ఆమె తెలిపారు. యూనిఫాం సర్విసులో ఉన్నవారు ధర్నాలో, బందులో పాల్గొనకూడదన్నారు. కొత్త సూపరింటెండెంట్ సెంట్రల్ జైల్‌ను ప్రక్షాళన చేస్తున్నారన్నారు. టెక్నాలజీని కూడా ఉపయోగగించుకుంటామని, సెంటర్ జైల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, పదిరోజులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. విశాఖ సెట్రల్ జైల్ నుండి కొంతమంది ఖైదీలను రాజమండ్రి జైల్‌కు తరలిస్తున్నామన్నారు. గత ఐదు సంవత్సరాలు సెంట్రల్ జైల్‌ను విజిట్ చేసిన దాఖలాలు లావని విమర్శించారు. టెక్నాలజీ నుండి ఎవ్వరు తప్పించుకోలేరన్నారు. పది, పదిహేను రోజుల్లో సెల్ ఫోన్ వ్యవహరంలో విచారణ రిపోర్టు వస్తుందని, జైల్లో సిబ్బందిని పెంచుతామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.


కాగా విశాఖ సెంట్రల్ జైలు భద్రత, కదలికలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జైల్లోని బ్యారెక్స్‌పై జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు తనిఖీలు చేపట్టారు. జైల్లోని అన్ని బ్లాక్ లలో అధికారులు సోదాలు నిర్వహించారు. నాలుగు రోజుల నుంచి తనిఖీలు చేయడంతో మూడు సెల్ ఫోన్లు, ఒక్క సెల్ బ్యాటరీ, రెండు డేటా కేబుల్లు స్వాధీనం చేసుకున్నామని అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితం విశాఖ మాజీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో నిందితుడు హేమంత్ కుమార్ డైరెక్ట్ లో దొరికిన రెండు సెల్ ఫోన్లు, బ్యాటరీ, రెండు డేటా కేబుళ్ళు. నిన్న నర్మదా బ్లాక్ లో జైలు సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అనిత ఈ రోజు విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోసానికి మారు పేరు కాంగ్రెస్: కేటీఆర్

నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్..

విశాఖ కలెక్టరేట్‌లో మంత్రి లోకేష్ సమీక్ష సమావేశం

కాంట్రాక్టర్ జనార్దన్ రెడ్డి ఆత్మహత్య..

గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కరించిన మంత్రి లోకేష్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 05 , 2025 | 12:28 PM