Home » Vijayawada Floods
ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేశారు..
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ఇప్పట్లో వదిలేలా లేవు. ఒకటి రెండు గంటలు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత నాన్ స్టాప్‌గా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ వర్షాల థాటికి విజయవాడ విల విల్లాడుతున్న సంగతి తెలిసిందే..
బెజవాడ వాసులను బుడమేరు (Budameru) ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు..! విజయవాడ (Vijayawada) పట్ల బుడమేరు.. పగ.. మేరులా మారి పట్టి పీడిస్తోంది..! ఒకటా రెండా సుమారు పది రోజులుగా ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది..! హమ్మయ్యా.. వానలు, వరద తగ్గాయ్ అనుకునే లోపే మళ్లీ బుడమేరు భయపెడుతోంది..!
Andhrapradesh: భారీ వరదలు విజయవాడకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వేలాది మంది తమ సర్వస్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. ఇళ్లన్నీ బురదమయమవడమే కాకుండా.. ఇంట్లోని సామన్లు కూడా పనికిరాకుండా పోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వరద బాధితులను ఆదుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు.
Andhrapradesh: వరద బాధితులకు సహాయం చేయడంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ ముందు వరుసలో ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరదలు ప్రజలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద బీభత్సం అంతా ఇంత కాదు. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించారు.
కూటమి సర్కార్.. అనుకున్నది సాధించింది. వరదలతో బెజవాడ ప్రజలను గజ గజ వణికించిన బుడమేరు పనులు విజయవంతంగా ముగిసాయి...
వరదలు, భారీ వర్షాలతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలను ఆదుకునేందుకు కార్పొరేట్ సంస్థలు మేము సైతం అంటూ ముందుకు వస్తున్నాయి.
Andhrapradesh: గత వారం రోజులుగా సింగ్‌నగర్ వాసులను అవస్థలకు గురిచేసిన బుడమేరు వరద కాస్త తగ్గుముఖం పట్టింది. భారీ వర్షాలతో బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వరదలతో బెజవాడ వాసులు స్తంభించిపోయారు. భారీ వరదలతో వేలాది మంది తమ తమ నివాసాలను వదలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.
Andhrapradesh: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.
: కొల్లేరు సరస్సులో ముంపు రోజురోజుకూ పెరుగుతూ గ్రామాలను చుట్టుముడుతోంది. ఎగువ నుండి భారీగా వరద సరస్సులోకి చేరడంతో అనేక గ్రామాలకు వెళ్లే రహదారులు మునిగాయి.