Nimmala Ramanaidu: కాసేపట్లో బుడమేరు వరద నుంచి బెజవాడ వాసులకు విముక్తి
ABN , Publish Date - Sep 07 , 2024 | 10:05 AM
Andhrapradesh: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 7: బుడమేరు గండ్లు పూడ్చి వేత పనులు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. రాత్రి వేల కూడా ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు కొనసాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... బుడమేరు మూడో గండి 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. మరికాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలించి బుడమేరు గండ్లు పూడిక పూర్తి అవుతుందన్నారు.
మిగిలిన 10శాతం ఇంకో రెండు గంటల్లో పూర్తి చేసి సింగ్ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే వరదను పూర్తిగా నివారిస్తామన్నారు. నేటితో బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని చెప్పారు. విపత్తుతో వేలాది మంది పడుతున్న కష్టంతో పోల్చితే తమ కష్టం ఎంత అని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కాగా.. క్షేత్రస్థాయిలో ఉండి పనులను నిమ్మల పర్యవేక్షిస్తుంటే.. మంత్రి లోకేష్ బుడమేరు మూడవ గండి పూడ్చివేత పనులపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఫ్లడ్ లైట్ల వెలుగులో రాత్రివేళ కూడా పనులను కొనసాగించారు.
మరోవైపు బుడమేరు శాంతించే పరిస్థితులు దరిదాపుల్లో కనిపించడం లేదు. వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. నందివాడ మండలంలోని 12 గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జాతీయ రహదారిపై రెండు నుంచి నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పశువుల సంరక్షణ కోసం వరద నీటిలోనే పలు కుటుంబాలు కాలం గడివుతున్నాయి. ముంపు ప్రాంతాల ప్రజలకు పడవల ద్వారానే ఆహారం... ఇతర సహాయ కార్యక్రమాలను అధికారులు అందిస్తున్నారు. వినాయక చవితి పండుగకు బుడమేరు పరివాహక గ్రామాల ప్రజలు దూరమయ్యాయి.
ఇవి కూడా చదవండి...
CM Chandrababu: చంద్రబాబు పిలుపునకు భారీ స్పందన.. వెల్లువెత్తుతున్న విరాళాలు
Read Latest AP News And Telngana News