Home » Vikas Raj
Telangana Polls: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. కొన్ని చోట్ల ఈవీఎంల సమస్య వస్తే.. అక్కడ కొత్తవి మార్చినట్లు చెప్పారు. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలని అన్నారు. ఇక నుంచి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. బుధవారం నాడు సీఈఓ కార్యాలయంలో ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలల్లో నాలుగు వేలకు పైగా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. అక్కడ అదనపు బలగాలతో పాటు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వికాస్‌రాజ్ తెలిపారు .
బీఆర్ఎస్‌కి సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) నోటీసులు పంపారు. స్కాం కాంగ్రెస్ పార్టీ పేరుతో పేపర్ ప్రకటనలపై ఎన్నికల కమిషన్‌కి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో BRS పార్టీ జనరల్ సెక్రటరీకి ఈసీ నోటీస్ ఇచ్చింది. 24గంటల్లో వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నోటీసులో పేర్కొంది.
ఎన్నికల ప్రచార సమయం నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు.
సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) ని తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిశారు. సోమవారం నాడు వికాస్‌రాజ్‌ని కలిసిన వారిలో ఎస్టీయూ ప్రెసిడెంట్ సదానందంగౌడ్ , పీఆర్టీయూ తెలంగాణ ప్రెసిడెంట్ చెన్నయ్య తదితరులు ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం అన్నీ ఏర్పాట్లు చేశామని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. ఆదివారం నాడు తన కార్యాలయంలో సీఈఓ వికాస్‌రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ ఏర్పాట్లపై మీడియాకు వివరాలు వెల్లడించారు.
Telangana Elections: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈసీఐ నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 30న బాన్సువాడ ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సీఈఓ నుంచి ఈసీఐకు రిపోర్ట్ చేరింది.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి ( Harshavardhan Reddy ) కలిశారు. పోస్టల్ బ్యాలెట్లల్లో నిర్లక్ష్యం, ప్రతి ఉద్యోగికి ఇంటి దగ్గర లేదా పంపిణీ కేంద్రం దగ్గర ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను ఎంఐఎం నేతలు ( MIM Leaders ) కలిశారు. నిన్న అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదుపై కౌంటర్ ఫిర్యాదు చేశారు.
సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ) ను కాంగ్రెస్ నేతలు కలిశారు. మంథని సెగ్మెంట్‌లో కాంగ్రెస్ నాయకులపై దాడి గురించి టీ - కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ ఫిర్యాదు చేశారు.