Share News

CEO Vikasraj : రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది

ABN , First Publish Date - 2023-11-27T23:27:31+05:30 IST

ఎన్నికల ప్రచార సమయం నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు.

CEO Vikasraj : రేపు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది

హైదరాబాద్: ఎన్నికల ప్రచార సమయం నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందని, అనంతరం 48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్ పాటించాల్సి ఉంటుందని సీఈఓ వికాస్‌రాజ్ ( CEO Vikasraj ) తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సీఈఓ వికాస్‌రాజ్ సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహణ, ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ, ఓటరు సమాచార స్లిప్పుల పంపిణీ, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎం యంత్రాల తరలింపు, కౌంటింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు చర్చించారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్‌లో భాగస్వామ్యం చేయాలని వికాస్‌రాజ్ తెలిపారు.

రిటర్నింగ్ అధికారులు సైలెన్స్ పీరియడ్‌లో పాటించాల్సిన నిబంధనలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు, అభ్యర్థులకు సమాచారం అందించాలన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చిన స్థానికేతరులు తిరిగి వెళ్లేలా చూడాలని చెప్పారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రం స్ట్రాంగ్ రూమ్‌కు ఈవీఎం యంత్రాల తరలింపు కోసం అవసరమైన వాహనాలను సిద్ధం చేసి బందోబస్తు మధ్య తరలించాలి. అవాంఛనీయ ఘటనలు జరిగేందుకు ఆస్కారం ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పోలింగ్ కేంద్రాలల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించాలని, జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని వికాస్‌రాజ్ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2023-11-27T23:27:35+05:30 IST