Home » Viveka Murder Case
న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. జులై 1వ తేదీన ఎర్రగంగిరెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం స్టే ఇచ్చింది.
హైదరాబాద్: అవినాష్ రెడ్డి (Avinash Reddy) ముందస్తు బెయిల్ పిటిషన్ (Mundostu Bail Petition)పై శుక్రవారం తెలంగాణ హైకోర్టు (Telangana Hidh Court)లో విచారణ జరగనుంది.
వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. శ్రీలక్ష్మిని త్వరలో సాధారణ వార్డుకు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ కేసుపై విచారణ శుక్రవారంనాటికి వాయిదా పడింది. గంగిరెడ్డికి షరతులతో కూడిన బెయిల్ రద్దు చేస్తూ... తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
వైఎస్ వివేకా మంచిగా జీవించారని.. ప్రస్తుతం ఆయన పేరును గబ్బులేపుతున్నారని సీఎం జగన్ మేనత్త, వైఎస్సార్, వివేకానంద రెడ్డి సోదరి విమలారెడ్డి పేర్కొన్నారు. అవినాష్ తల్లి శ్రీలక్ష్మిని చూడడానికి హాస్పిటల్‌కు వచ్చిన విమలారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రీలక్ష్మి మృత్యువు దగ్గరికి వెళ్లి వచ్చిందని.. ఆమెను చూసి ప్రార్థన చేయడానికి వచ్చానని తెలిపారు. చంపిన వాళ్ళు విచ్చల విడిగా తిరుగుతున్నారని.. తప్పు చేయని వాళ్ళు జైల్లో ఉన్నారన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) నిజానిజాలేంటి..? పాత్రదారులెవరు..? సూత్రదారులెవరు..? అని తేల్చడానికి సీబీఐ (CBI) దూకుడు పెంచింది. ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయగా.. ఒకట్రెండు అరెస్టులతో ఈ కేసు దాదాపు కొలిక్కి వచ్చేస్తుందని తెలుస్తోంది..
తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించిన వెకేషన్ బెంచ్ నిరాకరించింది. దీంతో అవినాశ్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగినట్టైంది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని.. జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి అనిరుథ్ బోస్ ధర్మాసనం సూచించింది.
వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి (Viswa Bharathi Hospital) పరిసర ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓ వైపు భారీగా పోలీసులు మోహరించగా.. మరోవైపు వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ఏ క్షణమైనా సరే..