Avinash Reddy : అవినాశ్‌కు సుప్రీంలో షాక్.. అరెస్ట్ చేసేందుకు సీబీఐకి తొలగిన అడ్డంకి
ABN , First Publish Date - 2023-05-22T12:11:55+05:30 IST
వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించిన వెకేషన్ బెంచ్ నిరాకరించింది. దీంతో అవినాశ్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగినట్టైంది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని.. జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి అనిరుథ్ బోస్ ధర్మాసనం సూచించింది.
ఢిల్లీ : వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ పిటిషన్ విచారణకు నిరాకరించిన వెకేషన్ బెంచ్ నిరాకరించింది. దీంతో అవినాశ్‌ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి అడ్డంకి తొలగినట్టైంది. మెన్షనింగ్ లిస్ట్‌లో ఉంటేనే విచారిస్తామని.. జడ్జిలు సంజయ్ కరోల్, అనిరుధ్ బోస్ ధర్మాసనం వెల్లడించింది. రేపు మెన్షనింగ్ ఆఫీసర్ ముందుకు వెళ్లాలని న్యాయమూర్తి అనిరుథ్ బోస్ ధర్మాసనం సూచించింది. న్యాయమూర్తి సంజయ్ కరోల్ ధర్మాసనం ముందు విచారణకు వేయవద్దని మెన్షనింగ్ ఆఫీసర్‌కి ధర్మాసనం సూచించింది.
గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్‌ను తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాశ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం వెల్లడించింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్‌ను అవినాశ్ మెన్షన్ చేశారు. హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందు బెయిల్ పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంను కోరుతున్నారు. రేపు మళ్లీ సుప్రీం కోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.