Home » Vizag Steel Plant Privatisation
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కార్మిక సంఘాల్లో నెలకొన్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం అమరావతిలోని క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలు సమావేశమయ్యారు.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ విధ్యార్థి, యువజ న సంఘాల ఆద్వర్యంలో రిలే మంగళవారం నిరాహార దీక్షలు నిర్వహిం చారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం తాకింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘దేవర’ మద్దతు ఇవ్వాలని జన జాగరణ సమితి వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. దేవర సినిమా పోస్టర్లపై ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ నినాదాలను జన జాగరణ సమితి నేతలు అతికించారు.
విశాఖ: స్టీల్ ప్లాంటు విషయంలో ఏళ్ల నాటి నిరీక్షణకు తెరపడడంలేదు. విశాఖ ఉక్కుపై ఎన్డీయే ప్రభుత్వం మాటలు కోటలు దాటాయి. కానీ పనులు మాత్రం చేతులు దాటడడంలేదు. కేంద్రమంత్రి వచ్చి హాడావుడి చేసి వెళ్లారు తప్ప.. పనులు మాత్రం ఆచరణలోకి రావడంలేదు. మరోవైపు ప్లాంటు పరిస్థితి రోజు రోజుకు మరింతగా దిగజారిపోతోంది.
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. సంస్థను ప్రైవేటీకరణ చేయబోమని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే తప్ప ఎటువంటి సాయం చేస్తారనే విషయం వెల్లడించడం లేదు.