Relay Hunger strike విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:11 PM
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ విధ్యార్థి, యువజ న సంఘాల ఆద్వర్యంలో రిలే మంగళవారం నిరాహార దీక్షలు నిర్వహిం చారు.
కలెక్టర్ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల రిలే దీక్ష
రాయచోటి (కలెక్టరేట్) అక్టోబరు 1: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ విధ్యార్థి, యువజ న సంఘాల ఆద్వర్యంలో రిలే మంగళవారం నిరాహార దీక్షలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా జిల్లా సీపీఐ కార్యదర్శి నరసింహులు, ఏఐవైఫ్ కార్యదర్శి వెంకటేష్ మాట్లా డుతూ 32 మంది విద్యార్థులు, వేలాది మంది రైతుల త్యాగం, వామపక్ష ఎమ్మెల్యేల రాజీనామాలతో సాధించుకున్న విశా ఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామన్న పవన కళ్యాణ్ అధికారంలోనికి రాగానే నష్టాలు వస్తే ఎన్నిరోజులు భరిస్తారని మాట మార్చడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. విశాఖ ఉక్కును సెయిల్‌లో కలుపుతామని ప్రకటన చేస్తూనే, రాత్రికి రాత్రే 4 వేల మంది కాంట్రాక్ట్ ఉ ద్యోగులను తొలగించడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు. వెంటనే విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, ఈ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ సభ్యుడు కోటేశ్వరరావు, లవకుమార్, ప్రశాంత, బాలసుబ్రణ్యం, గురునాథ్, సతీష్, అశోక్, చందు తదితరులు పాల్గొన్నారు.