Home » Vote
Andhrapradesh: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ఎలాగైనా అధికారం చేపట్టాలని వైఎస్సార్సీపీ సన్నాహాలు చేస్తోంది. ఓ వైపు సిద్దం అంటూ సభలు పెడుతూనే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని యత్నిస్తోంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ ప్రలోభాల పర్వానికి తెరతీసింది. గత రెండు రోజుల నుంచి ఓటర్లకు చీరల పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ శతవిధాలుగా ప్రయత్నాలు చేపట్టింది.
YSRCP-Voters: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో వైసీపీ నేతలు, మద్దతుదారుల అక్రమాలు ఎన్నో వెలుగు చూశాయి. కార్యకర్తల నుంచి పెద్దల వరకూ డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు నమోదు చేసిన ఘటనలు బయటపడ్డాయి.
శివసేనకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నోటి దురుసును ప్రదర్శించారు. తనకు ఓటు వేయించాలని పిల్లలను కోరారు. ఎన్నికలకు సంబంధించిన అంశాల్లో పిల్లల గురించి మాట్లాడొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఆ ప్రకటన చేసి వారం రోజులు గడవక ముందే కలమ్ నూరి ఎమ్మెల్యే సంతోష్ బంగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఓటు ద్వారా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే వీలు ఉంటుంది. అలాంటి మీ ఓటు ఉన్నదో, లేదో ఎప్పడికప్పుడు తనిఖీ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన వైసీపీ నేత కామిరెడ్డి రాజారెడ్డికి ఏకంగా మూడు చోట్ల ఓటు ఉంది. ఈ అంశంపై రాజకీయ ర్గావల్లో పెను దుమారం రేపింది.
ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. దొంగ ఓట్లపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏడాదిలో కేంద్ర ఎన్నికల సంఘం 30 లక్షల ఓట్లను తొలగించిందని చెబుతున్నాయి. వలసల పేరుతో తమ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ఆరోపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను సోమవారం ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఫామ్-7 దరఖాస్తులు ఎక్కువగా వచ్చినట్టు గుర్తించింది. రాష్ట్రంలో 70 కేసులు నమోదు చేసింది. అత్యధికంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 23 కేసులు నమోదు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయి.
ఏపీలో ఫేక్ ఓటర్ల విషయంలో ఇటివల ఓ జిల్లా కలెక్టర్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయితే 2021 తిరుపతి ఎన్నికల్లో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవడానికి రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ఈ క్రమంలో ఎందుకు ఇంత ఆలస్యమైందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.