Voters List: ఏపీ ఓటర్ల తుది జాబితా విడుదల నేడు
ABN , Publish Date - Jan 22 , 2024 | 07:00 AM
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదల కానుంది. గత ఏడాది అక్టోబర్ 27న విడుదలైన ముసాయిదా జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. జీరో డోర్ నెంబర్‌తో ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని తుది ఓటర్ల జాబితాలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
కాగా తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డులను డౌన్‌లోడ్ చేసి నకిలీ కార్డులు సృష్టించడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఇప్పటికే ఓ ఐఏఎస్ అధికారితో పాటు, మరింత మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తుది వాటర్ల జాబితాలో తప్పులు వస్తే తమపై ఎలాంటి చర్యలు ఉంటాయో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.