Vote: వైసీపీ నేతకు మూడు చోట్ల ఓటు
ABN , Publish Date - Jan 25 , 2024 | 08:58 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన వైసీపీ నేత కామిరెడ్డి రాజారెడ్డికి ఏకంగా మూడు చోట్ల ఓటు ఉంది. ఈ అంశంపై రాజకీయ ర్గావల్లో పెను దుమారం రేపింది.
శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల (Votes) తొలగింపు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. ఏడాదిలో 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిన సంగతి తెలిసిందే. ఈసీ తీరును ప్రతిపక్షాలు తప్పు పడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న సమయంలో ఓట్లను తొలగించడాన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్న ఓట్లను తొలగించారు. మరికొన్ని చోట్ల దొంగ ఓట్లు అలానే ఉన్న విషయం తెలిసింది. వైసీపీ నేతలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయనే అంశం వెలుగుచూసింది. తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన వైసీపీ నేత కామిరెడ్డి రాజారెడ్డికి ఏకంగా మూడు చోట్ల ఓటు ఉంది. ఈ అంశంపై రాజకీయ ర్గావల్లో పెను దుమారం రేపింది. రాజారెడ్డికి నాయుడుపేట మున్సిపాలిటీ నాయుడుపేట 68వ పోలింగ్ కేంద్రంలో ఓటు ఉంది. దాంతోపాటు వేముగుంటపాళెం, మర్లపల్లిలో ఓటు ఉంది. ఇక్కడ అతని భార్యకు కూడా ఓటు ఉంది.
ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాలో కేంద్ర ఎన్నికల సంఘం 30 లక్షల ఓట్లను తొలగించింది. 2023 జనవరి 6వ తేదీ నుంచి 2024 జనవరి 22వ తేదీ మధ్య 30 లక్షల ఓట్లను తొలగించారు. ఇందులో 14.26 లక్షల ఓట్లు వలస వెళ్లిన వారు అని తీసివేశారు. వలస పేరుతో తమ మద్దతుదారుల ఓట్లు తొలగించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓట్ల తొలగింపు ప్రక్రియలో మృతులు, ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ ఓట్లు ఉంటే తొలగిస్తారు. ఈ సారి అందుకు భిన్నంగా ఓట్లను తీసివేశారు. 2022 జనవరి 6వ తేదీ నుంచి 2023 జనవరి 5వ తేదీ మధ్య 11,23,829 ఓట్లను తొలగించారు. ఇందులో వలసల పేరుతో 1,11,578 ఓట్లు తొలగించారు. 2024లో మాత్రం 14.26 లక్షల ఓట్లను తీసివేశారు. ఏడాదిలో దాదాపు 13 లక్షల ఓట్లు షిప్ట్ అయ్యారని తీసివేయడం అనుమానాలకు తావిస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.