Home » West Bengal
పశ్చిమ బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఆ రాష్ట్ర గవర్నర్‌కి మధ్య పరిస్థితి ఉప్పు నిప్పుల మారింది. తన పరువుకు దీదీ భంగం కలిగించారని ఆరోపిస్తూ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Ananda Bose) ఆమెపై పరువు నష్టం దావా వేశారు.
నీట్ పరీక్షను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee) కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి(PM Modi) సోమవారం లేఖ రాశారు.
నీట్‌ను పూర్తిగా రద్దుచేయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు. ప్రశ్నపత్రం లీకేజీపై సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని ప్రధాని మోదీకి సోమవారం లేఖ రాశారు.
కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
రాజ్‌భవన్‌లో తనకు భద్రత లేదని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్(CV Anand Bose) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కార్యాలయంలో పూర్తిగా బెంగాల్(West Bengal) పోలీసులే మోహరించి ఉన్నారని పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేడర్‌పై అధికార టీఎంసీ శ్రేణులు వరుసగా దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులపై బీజేపీ అగ్రనాయకత్వం నలుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ విచారణ కమిటి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుంది. ఆ క్రమంలో విచారణ బృందం ఎదుట బీజేపీ కేడర్ మంగళవారం ఆందోళనకు దిగింది.
మరో రైలు ప్రమాదం..! కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మరువకముందే.. విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు ఉదంతం కళ్లముందు కదలాడుతుండగానే.. ఇంకో ఉదంతం! పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్‌పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం న్యూ జల్పాయ్గురి(New Jalpaiguri) రైలు ప్రమాదం(Train Accident) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan) తెలిపారు. కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
పశ్చిమబెంగాల్ లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు.
పశ్చిమ బెంగాల్లో కాంచన్ జంఘా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాద దుర్ఘటన న్యూజల్పాయిగూరి వద్ద చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆ మార్గంలో పలు రైల్వే సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే శాఖ సోమవారం ప్రకటించింది. అలాగే పలు రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది.