Share News

Adhir Ranjan: లోక్‌సభ ఫలితాల పర్యవసానం.. అధీర్ రంజన్ రాజీనామా

ABN , Publish Date - Jun 21 , 2024 | 04:33 PM

కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారంనాడు రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్‌లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు.

Adhir Ranjan: లోక్‌సభ ఫలితాల పర్యవసానం.. అధీర్ రంజన్ రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి (Adhir Rajan Chowdhury) పశ్చిమబెంగాల్ (West Bengal) కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శుక్రవారంనాడు రాజీనామా (resign) చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో పాటు పశ్చిమబెంగాల్‌లో పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ పార్టీ పదవికి ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాపై పార్టీ అధిష్ఠానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

Delhi water crisis: ముదిరిన నీటి సంక్షోభం.. సత్యాగ్రహ దీక్ష ప్రారంభించిన అతిషి


యూసుఫ్ పఠాన్ చేతిలో ఓటమి

కాంగ్రెస్ సారథ్యంలోని 'ఇండియా' కూటమిలో టీఎంసీ భాగస్వామిగా ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు లేకుండానే కాంగ్రెస్, టీఎంసీ వేర్వేరుగా ఎన్నికలకు వెళ్లాయి. అధీర్ రంజన్ వైఖరి వల్లే తాము ఒంటరిగా పోటీకి వెళ్లాల్సి వచ్చిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అప్పట్లో ఆరోపించగా, కాంగ్రెస్‌కు గండికొట్టే ఆలోచనలో మమత ఉన్నారంటూ అధీర్ విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా చతికిలపడటంతో పాటు యూసుఫ్ పఠాన్ చేతిలో అధీర్ రంజన్ ఓడిపోయారు. తనను ఓడించేందుకు మమత పన్నిని వ్యూహం ఫలించిందంటూ దీనిపై అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని మతవిశ్వాసాల వారు తనకు పెద్ద సంఖ్యలో ఓట్లు వేశారని అన్నారు. అయితే వరుసగా ఆరోసారి బహరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలిచేందుకు తగినన్ని ఓట్లు రాలేదని చెప్పారు. 1999 నుంచి బహరాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా అధీర్ రంజన్ ఉన్నారు.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 04:33 PM