Home » West Bengal
కొన్నిసార్లు సినిమా తరహా ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు సినిమా హీరోల్లా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ అందరి మన్ననలూ పొందుతుంటారు. ఇలాంటి...
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్బుక్లో పోస్టు చేశారు.
ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై.. మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని.. మోదీ సర్కారు పదిహేను రోజుల్లో కూలిపోవచ్చేమో? అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా, అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు.
ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమత డిమాండు చేశారు. అ
నాలుగు వందల పైచిలుకు లోక్‌సభ స్థానాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్డీయే పశ్చిమబెంగాల్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 41 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 18 స్థానాల్లో విజయం సాధించింది.
ఎగ్జిట్ పోల్స్ అంతా అబద్దమని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ సంస్థలు పేర్కొన్నాయి. ఆ సంస్థల నివేదికలను దీదీ తప్పు పట్టారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా ఈసారి కనీవినీ ఎరుగనంతగా బీజేపీకి ప్రజల మద్దతు కనిపిస్తోందని, ప్రజల ఆదరణ అనూహ్యంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమబెంగాల్లోని మధురాఫూర్ బుధవారంనాడు జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ, కోల్‌కతాలో జరిపిన రోడ్‌షోలో ప్రజలు చూపిన ఆదరణ ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్, బారాసత్‌లో మంగళవారం సుడిగాలి ప్రచారం సాగించారు. తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కోర్టుల తీర్పులను అమలు చేసేది లేదని టీఎంసీ చెబుతుండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమకు అనూకూలంగా తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులపై గూండాలను సైతం ఉసిగొలుపుతారా? అని ప్రశ్నించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. జూన్1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరగనుంది. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. జూన్4న ఓట్లు లెక్కిస్తారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టేదెవరో తేలిపోనుంది. ఫలితాలకు మూడు రోజుల ముందు ఇండియా కూటమి సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.