Share News

Lok Sabha Elections: జడ్జీలపై గూండాలను వదులుతారా? టీఎంసీని ప్రశ్నించిన మోదీ

ABN , Publish Date - May 28 , 2024 | 07:37 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్, బారాసత్‌లో మంగళవారం సుడిగాలి ప్రచారం సాగించారు. తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కోర్టుల తీర్పులను అమలు చేసేది లేదని టీఎంసీ చెబుతుండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమకు అనూకూలంగా తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులపై గూండాలను సైతం ఉసిగొలుపుతారా? అని ప్రశ్నించారు.

Lok Sabha Elections: జడ్జీలపై గూండాలను వదులుతారా? టీఎంసీని ప్రశ్నించిన మోదీ

జాదవ్‌పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పశ్చిమబెంగాల్‌లోని జాదవ్‌పూర్, బారాసత్‌లో మంగళవారంనాడు సుడిగాలి ప్రచారం సాగించారు. తృణమూల్ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. కోర్టుల తీర్పులను అమలు చేసేది లేదని టీఎంసీ చెబుతుండటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమకు అనూకూలంగా తీర్పులు ఇవ్వని న్యాయమూర్తులపై గూండాలను సైతం ఉసిగొలుపుతారా? అని ప్రశ్నించారు.పశ్చిమబెంగాల్‌లో 2010 నుంచి వివిధ వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఓబీసీ స్టాటస్‌ను కోల్‌కతా హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. ఈ తీర్పును మమతా బెనర్జీ తప్పుపట్టారు. తీర్పు తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు తీర్పుపై బీజేపీ ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు.


న్యాయవ్యవస్థను ఎలా ప్రశ్నిస్తారు..

2010 తర్వాత మంజూరు చేసిన ఈబీసీ సర్టిఫికెట్లు చెల్లవంటూ కోల్‌కతా హైకోర్టు తీర్పు ఆమోదయోగ్యం కాదని టీఎంసీ ప్రకటించడం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారు. తమ మోసాలు, అబద్ధాలు బహిర్గతం కావడం టీఎంసీకి ఇష్టం ఉండదని, న్యాయవ్యవస్థ పట్ల, రాజ్యాంగం పట్ల వారికి విశ్వాసం లేదా? అని ప్రశ్నించారు. తమ మోసాలు బయటపెట్టిన న్యాయమూర్తులపై కూడా గూండాలను ఉసిగొల్పుతారా అనేది తాను తెలుసుకోవాలనుకుంటున్నానని అన్నారు. కేవలం తమ ఓటు బ్యంకును కాపాడుకునేందుకే రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ్ సంఘ్ సాధువులకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ ఇటీవల కామెంట్లు చేశారని మోదీ తప్పుపట్టారు.

Lok Sabha Elections: అవును...పారిశ్రామిక వేత్తలను కాపాడేందుకే భగవంతుడు మోదీని పంపాడు..!


సీఏఏను ఎవరూ ఆపలేరు..

పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేది లేదని మమత చెబుతున్నారని, అయితే సీఏఏ అమలును ఎవరూ ఆపలేరని, చట్టానికి ప్రజల నుంచి అసాధారణమైన మద్దతు ఉందని చెప్పారు. సీఏఏ అనేది ప్రజలకు పౌరసత్వం ఇచ్చే చట్టమే కానీ, ఊడలాక్కునే చట్టం కాదన్నారు. కేవలం ఓటు బ్యాంకు కోసం సీఏఏపై టీఎంసీ తప్పుడు సమాచారం ప్రచారం చేస్తూ ప్రజలను భయపెడుతోందని వివరించారు.

For More National News and Telugu News..

Updated Date - May 28 , 2024 | 07:40 PM