Home » Whatsapp
యూజర్లకు మెరుగైన అనుభూతి అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్న వాట్సప్ మరో రెండు కొత్త అప్డేట్లతో ముందుకొచ్చింది. వాట్సప్(Whatsup) ఆండ్రాయిడ్ యూజర్ల స్టేటస్ అప్డేట్లకు త్వరగా స్పందించడానికి వినియోగదారులకు అనుమతించే క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.
వాట్సప్ వినియోగదారులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న ఏఐ చాట్‌బాట్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ Meta AI చాట్‌బాట్‌ను తక్షణ సందేశ ప్లాట్‌ఫారమ్‌కు తీసుకువస్తుంది. అయితే ఈ Meta AI ఐకాన్ భారత్‌లోని కొంతమంది వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తున్న వాట్సాప్ తాజాగా మరో రెండు ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. వాట్సాప్ ఈ రెండు కొత్త ఫీచర్లపై పని చేస్తోంది.
వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చే వాట్సప్ తీసుకున్న ఓ నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ కు చెందిన 76 లక్షలకుపైగా అకౌంట్లను వాట్సప్ నిషేధించింది. ఫిబ్రవరి 1 నుంచి 29 మధ్య కాలంలో 76,28,000 వాట్సప్ అకౌంట్లను నిషేధించింది.
వాట్సప్..(WhatsApp) వినియోగదారుల గోప్యతకు ప్రాధాన్యమిస్తూ.. రకరకాల ఫీచర్లను ప్రవేశపెడుతూ వస్తోంది. ఇప్పటికే లాక్ చాట్, ఎండ్ టు ఎండ్ ఎన్స్కిప్షన్ తదితర భద్రతాపరమైన ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సప్.. తాజాగా మరో అప్డేట్తో ముందుకొచ్చింది.
వాట్సాప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టేటస్ పెట్టే వారి సంఖ్య పెరిగిపోతోంది. మూడ్ స్వింగ్స్ కు తగ్గట్టు లేటేస్టే అప్డేట్స్ ను స్టేటస్ లో షేర్ చేస్తుంటారు. ఆనందమైనా, బాధైనా ఇలా ఏదైనా కాదేదీ స్టేటస్ కు అనర్హం అన్నట్లు నిత్యం సోషల్ మీడియాలో గడిపేస్తుంటారు మరికొందరు. స్టేటస్ లు అందరూ చూస్తారు. అందరూ పెడతారు.
వినియోగదారులకు ఎప్పటికప్పుడు మెరుగైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్న వాట్సప్ తాజాగా మరో అదిరిపోయే ఫీచర్‌తో ముందుకు వచ్చింది. ఇన్నాళ్లు క్రోమ్ బ్రౌజర్లో వేర్వేరు సైట్లను ఉపయోగించుకుని ఏఐ ఫొటోలను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉండేది.
యూజర్స్‌కి మెరుగైన అనుభూతిని ఇచ్చే ప్రయత్నాల్లో భాగంగా వాట్సప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్స్తో ముందుకు వస్తోంది. తాజాగా ప్రవేశపెట్టాలనుకుంటున్న ఓ ఫీచర్ ద్వారా ఒకే సారి మూడు చాట్లను పిన్ చేసుకునే సదుపాయం కలుగుతుంది.
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp ఆండ్రాయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉంది. అదే మన వాయిస్‌ని టెక్ట్స్ ఫార్మట్‌లోకి మార్చడం. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ ప్లాట్ ఫాం వాట్సాప్(whatsapp) నుంచి మరో క్రేజీ ఫీచర్ రాబోతుంది. ప్రస్తుతం 30 సెకన్ల వాట్సాప్ స్టేటస్ ఫీచర్(status feature) ఉండగా, అది త్వరలో 60 సెకన్లకు పెంచుతాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి.