WhatsApp DP: వాట్సాప్ డీపీలో ఫొటో మార్చి.. మహిళను ఏమార్చి..
ABN , Publish Date - Feb 01 , 2025 | 10:02 AM
వాట్సాప్ డీపీ(WhatsApp DP)లో కజిన్ ఫొటో ఉండటంతో ఫోన్ చేసింది అమెరికా(America)లో ఉన్న తన అన్నయ్య అని భావించిన నగర మహిళ రూ.2 లక్షలు మోసపోయింది. నగరానికి చెందిన మహిళ(50)కు వాట్సప్ కాల్(WhatsApp call) వచ్చింది.

- రూ.2 లక్షలు కాజేసిన సైబర్ నేరగాడు
హైదరాబాద్ సిటీ: వాట్సాప్ డీపీ(WhatsApp DP)లో కజిన్ ఫొటో ఉండటంతో ఫోన్ చేసింది అమెరికా(America)లో ఉన్న తన అన్నయ్య అని భావించిన నగర మహిళ రూ.2 లక్షలు మోసపోయింది. నగరానికి చెందిన మహిళ(50)కు వాట్సప్ కాల్(WhatsApp call) వచ్చింది. కొత్త నంబర్ అయినా వాల్సాప్ ప్రొఫైల్‌లో తన కజిన్ ఫొటో ఉండటంతో అతడే అని భావించి మాట్లాడింది. ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కజిన్ పేరు చెప్పి, పరిచయస్తుడిలా మాట్లాడాడు. వెంటనే అత్యవసరంగా ఇండియాలో ఉన్న వ్యక్తికి డబ్బు పంపాలని, రేపటికల్లా ఇచ్చేస్తాననని నమ్మబలికాడు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: ఎక్సైజ్ అకాడమీని తనిఖీ చేసిన మంత్రి జూపల్లి
అతడి మాటలు నమ్మిన మహిళ గూగుల్‌పే(Google Pay) ద్వారా రూ.1లక్ష, బ్యాంక్ ఖాతా ద్వారా మరో రూ.1 లక్ష అతడు సూచించిన ఖాతాలకు పంపించింది. మళ్లీ ఫోన్ చేసిన సైబర్ నేరగాడు ఇంకా డబ్బు పంపాలని కోరడంతో అనుమానం వచ్చి, కజిన్‌కు ఫోన్ చేసింది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Financial Survey: పన్ను వసూళ్లలో తెలంగాణ నం.1
ఈవార్తను కూడా చదవండి: ప్రయాగ్‌రాజ్‌లో నలుగురు మహిళల అదృశ్యం!
ఈవార్తను కూడా చదవండి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు.. కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: ఏకంగా సచివాలయంలో నకిలీ ఉద్యోగులు హల్‌చల్
Read Latest Telangana News and National News