CM Chandrababu: మీకు వాట్సాప్ ఉంటే చాలు.. మీ ఫోన్‌లోనే ప్రభుత్వం
ABN , Publish Date - Jan 29 , 2025 | 06:34 PM
Whats app governance services: తొలి విడతలో భాగంగా.. 161 పౌర సేవలను వాట్సాప్ ద్వారా అందించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సేవలను గురువార అంటే జనవరి 30వ తేదీన మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు.

అమరావతి, జనవరి 29: ప్రభుత్వ సేవలను ప్రజల ముంగిట తీసుకు వచ్చేందుకు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అందులోభాగంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను గురువారం నుంచి ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. దీంతో దేశంలోనే తొలి సారిగా వాట్సాప్ గవర్నెన్సు ద్వారా పౌర సేవలను ఏపీ ప్రభుత్వం అందించినట్లు అవుతోంది. తొలి విడతలో 161 సేవలను వాట్సాప్ ద్వారా పౌర సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆ క్రమంలో ఉండవల్లిలో ప్రజాదర్బార్‌లో ఈ వాట్సాప్ గవర్నెన్సు సేవల్ని ఐటీ, విద్యా, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. అందులోభాగంగా దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ , అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ శాఖలలోని సేవలను వాట్సప్ ద్వారా పొందవచ్చు.
అలాగే పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని గతంలో ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబరు 22వ తేదీ.. వాట్సాప్ ద్వారా ఈ పౌర సేవలు అందించేందుకు మెటా సంస్థతో చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న విషయం విధితమే.
వేగంగా పౌరసేవలు అందించటంతోపాటు పారదర్శకత, జవాబుదారీతనంలో భాగంగా ఈ వాట్సాప్ గవర్నెన్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిందీ ప్రభుత్వం. అలాగే సమాచార గోప్యతతోపాటు వేగంగా సేవలందించేందుకు జనరేటివ్ ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్‌ను వినియోగించనున్నారు.
Also Read: జాతీయ క్రీడల జరుగుతోన్న వేళ.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు
Also Read: హైకోర్టు తీర్పుపై స్పందించిన జ్యోతి సురేఖ
అదే విధంగా దేవాదాయశాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శనాల టికెట్లు, గదుల బుకింగ్, డోనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన విషయం విధితమే. రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులతోపాటు ఇతర ముఖ్యమైన సర్టిఫికెట్లు సైతం ఈ వాట్సాప్ పౌర సేవల్లో భాగంగా జారీ చేయాలని నిర్ణయం.
Also Read: పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్
Also Read: ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతోన్న ముఠా గుట్టను రట్టు చేసిన పోలీసులు
ఇక మున్సిపల్ శాఖలో ఆస్తి పన్ను చెల్లింపులు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించాయి. ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు, ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశాన్ని సైతం కల్పించింది.
Also Read: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు కేంద్ర మంత్రులు.. అసలు విషయం ఇదే
అయితే రెండో విడతలో మరిన్ని పౌరసేవల్ని అందించాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరహా సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో ఈ తరహా పౌర సేవలను అందుబాటులోకి తీసుకు రానుంది.
For AndhraPradesh News And Telugu News