Home » Yadagirigutta
భువనగిరి: తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆషాఢమాసం అయినప్పటికీ సెలవు రోజు కావడంతో సుమారు 30 వేల మంది భక్తులు రాగా.. ప్రత్యేక, ధర్మ దర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది.
గోపురం సహా ఆలయం తనను తాను అద్దంలో చూసుకున్నట్టు లేదూ! యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధిలోనిదీ దృశ్యం.
తిరుమల తరహాలో యాదగిరిగుట్ట ఆలయంలో స్వయంభువులకు ఎదురుగా క్యూకాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నామని యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్‌రావు చెప్పారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. వీఐపీ టికెట్ దర్శనానికి గంట,
ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి(Yadagirigutta Sri Lakshminarasimhaswamy) వారి ఆలయంలో ఆనవాయితీగా వస్తున్న గిరి ప్రదక్షిణ వైభవంగా జరిగింది. ఉద్ఘాటన అనంతరం మంగళవారం గిరి ప్రదక్షిణను ప్రారంభించగా.. భక్తులు ‘నమో నారసింహ’ అంటూ ఆద్యంతం ఉత్సాహంగా పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి జయంత్యుత్సవాలు పాంచరాత్రాగమ రీతిలో సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు స్వస్తివాచనంతో శ్రీకారం చుట్టారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలు ఆలయ ప్రధానార్చకుడు నల్లంథీఘళ్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో జరిగాయి.
రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వాటిని సరిగా ప్రచారం చేసుకోలేకనే ఎన్నికల్లో ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలిచిందని చెప్పారు.