Home » Yatra
అమర్నాథ్ యాత్ర త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ సేవలు జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చని యాత్రికులకు జమ్ము కశ్మీర్ అధికార వర్గాలు గురువారం స్పష్టం చేశాయి. అయితే ఈ హెలికాఫ్టర్ సర్వీస్ రేట్లను త్వరలో విడుదల చేస్తామని తెలిపాయి.
కర్నూలు: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ సోమవారం నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వర్ణాంద్ర సాకార యాత్ర చేయనున్నారు. ఇవాళ నందికొట్కూరు, కర్నూలులో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభమై రెండు నెలల పాటు జరుగనుందని, ఆగస్టు 19తో యాత్ర ముగుస్తుందని అమర్నాథ్ బోర్డు ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అమర్నాథ్ యాత్ర కోసం ఈనెల 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర(bharat jodo nyay yatra)' జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభం కానుందని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శమా అహ్మద్ పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ప్రధానంగా ఈ అంశాలపైనే అధికార బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు తెలిపారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ బుధవారం నుంచి వరుస కార్యక్రమాలు చేపట్టనుంది. ‘నిజం గెలవాలి’ పేరుతో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి నారా భువనేశ్వరి యాత్ర చేయనున్నారు. చంద్రబాబు అరెస్టు కారణంగా ఆవేదనతో మృతి చెందిన కుటుంబాలను ఆమె పరామర్శించనున్నారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ చేపట్టిన భవిష్యత్ గ్యారెంటీ చైతన్య యాత్ర ఆదివారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. చుట్టుగుంట సెంటర్ నుంచి కృష్ణలంక వరకు చైతన్య యాత్ర కొనసాగునుంది.
ఉత్తరాఖండ్ లో కేదార్నాథ్ యాత్రను నిలిపివేశారు. రుద్రప్రయాగ్ జిల్లాలో భారీ వర్షాలు పడుతుండటంతో సోన్‌ప్రయాగ్ వద్ద యాత్రను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని రుద్రప్రయాగ్ జిల్లా మెజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ తెలిపారు.