Share News

Kanwar Yatra Name Plates: సుప్రీంకోర్టు 'స్టే'పై ఎన్డీయే కీలక భాగస్వామి హర్షం

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:07 PM

కావడి యాత్ర ర్గంలోని హోటళ్లు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానులు, సిబ్బంది పేర్లు పెట్టాలంటూ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారంనాడు 'మధ్యంతర స్టే' ఇచ్చింది. విపక్షాలతో పాటు ఎన్డీయే కీలక భాగస్వామి జనతాదళ్ యూనైటెడ్ సైతం ఈ తీర్పును స్వాగతించింది.

Kanwar Yatra Name Plates: సుప్రీంకోర్టు 'స్టే'పై ఎన్డీయే కీలక భాగస్వామి హర్షం

న్యూఢిల్లీ: కావడి యాత్ర (Kanwar Yatra) మార్గంలోని హోటళ్లు, తోపుడుబండ్ల ముందు వాటి యజమానులు, సిబ్బంది పేర్లు పెట్టాలంటూ ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు (Supreme court) సోమవారంనాడు 'మధ్యంతర స్టే' (interm stay) ఇచ్చింది. అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై విపక్షాలు హర్షం వ్యక్తం చేయగా, బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కీలక భాగస్వామి జనతాదళ్ యూనైటెడ్ (JDU) సైతం తీర్పును స్వాగతించింది.


యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఆదేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, తినుబండారాల విక్రేతలు తమ దుకాణాల వద్ద యజమానులు, ఉద్యోగుల పేర్లు ప్రదర్శించాలంటూ బలవంతం చేయరాదని న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్పీఎస్ భట్టితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

Suprme Court: కావడి యాత్రలో పేర్ల ప్రదర్శనపై స్టే.. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని 'సుప్రీం' ఆగ్రహం


స్వాగతిస్తున్నాం: జేడీయూ

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను జేడీయూ ప్రతినిధి కేసీ త్యాగి స్వాగతించారు. సమాజాన్ని విడగొట్టేలా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయనే ఆందోళనలు తమకు ఉన్నాయన్నారు. ఈ విజయాన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.


సీఎంలకు మోదీ రాజధర్మం చెబుతారా?: కాంగ్రెస్

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేర చెప్పారు. యోగి సర్కార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకమని కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీ మొత్తం చెప్పాయని, ప్రధాని మంత్రి ఇప్పటికైనా తమ ముఖ్యమంత్రులకు 'రాజధర్మం' గురించి వివరించి, ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా చూస్తారని ఆశిస్తున్నామని అన్నారు. శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు తీర్పును తమ పార్టీ స్వాగతిస్తోందని, అధికార బీజేపీ ఈ తరహా దిగజారుడు రాజకీయాలు జరుపుతోందని అన్నారు.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 04:11 PM