Home » YCP Minister Chelluboina Venu
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ( Minister Venugopalakrishna ) కు గుండెనొప్పి వచ్చింది. దీంతో మంత్రిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తాడేపల్లి మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
అమరావతి: 139 వర్గాలుగా ఉన్న బీసీల కులగణన జరగాల్సి ఉందని, జనగణన ప్రక్రియలో కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని, అది ప్రస్తుతం జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
పార్టీ మారుతున్నారన్న ఊహాగానాలకు వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ (pilli subhash chandra bose) తెరదించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections) దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీలో నేతల మధ్య విబేధాలు ఎక్కువవుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో (East Godavari) మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వర్సెస్ ఎంపీ పిల్లి సుభాష్ (Minister Venu Vs MP Pilli) మధ్య ‘రామచంద్రాపురం’ (Ramachandrapuram) గొడవ జరుగుతున్న విషయం తెలిసిందే...
స్వయంగా ముఖ్యమంత్రి జగన్ జోక్యం చేసుకున్నప్పటికీ పరిస్థితి ఏ మాత్రం సద్దుమణగలేదు. మంత్రి వేణు, ఎంపీ బోసు నువ్వా? నేనా? అన్నట్టు ఇరు వర్గాలు తలపడుతున్నాయి. తనకు వ్యతిరేకంగా మంత్రి వేణు వర్గం పనిచేస్తున్నా.. అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఎంపీ బోసు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తరుణంలో వచ్చే నెలలో ఏ క్షణమైనా వైసీపీకి రాజీనామా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
కోనసీమ జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం సీటును తన కుమారుడికి ఇప్పించేలా ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రయత్నిస్తుండగా.. తన సీటు వదులుకునేందుకు మంత్రి వేణుగోపాలకృష్ణ సుముఖంగా కనిపించడం లేదు. దీంతో జిల్లాలో ఈ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే రామచంద్రపురంలో తనకు వ్యతిరేకంగా ఏమీ జరగడం లేదని మంత్రి వేణు క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు.
కోనసీమ జిల్లా: రామచంద్రపురం మండలం నియోజక వర్గంలో ప్రజలు మంత్రి వేణుకు షాక్ ఇచ్చారు. వెంకటాయపాలెంలో ఆదివారం ఉదయం 10 గంటలకు మంత్రి వేణుకు వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.
వైసీపీ ఎంపీ బోస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. మంత్రి వేణుకు టిక్కెట్ ఇస్తే ఆయనపై స్వయంగా బోసే తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం కూడా జోరందుకుంది. కాగా ఉమ్మడి జిల్లా వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్లుగా ఎంపీ బోస్, మరో ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు.