Minister Chellaboina: 139 వర్గాలుగా ఉన్న బీసీల కులగణన జరగాల్సి ఉంది
ABN , First Publish Date - 2023-10-18T16:09:15+05:30 IST
అమరావతి: 139 వర్గాలుగా ఉన్న బీసీల కులగణన జరగాల్సి ఉందని, జనగణన ప్రక్రియలో కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని, అది ప్రస్తుతం జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
అమరావతి: 139 వర్గాలుగా ఉన్న బీసీ (BC)ల కులగణన జరగాల్సి ఉందని, జనగణన ప్రక్రియలో కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశామని, అది ప్రస్తుతం జరిగే అవకాశం లేదని స్పష్టమవుతోందని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ (Minister Chellaboina Venugopal) వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాష్ట్ర ప్రభుత్వమే బీసీల కులగణన చేయాలని నిర్ణయించామని, దీనిపై సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో ఒక కమిటీ నియమించామని చెప్పారు.
సంఖ్యా పరంగా ఎంత మంది ఉన్నారని ఆయా బీసీ వర్గాల వారు తెలుసుకోవడం అవశ్యకమని, దీనికి కులగణన ఒక్కటే మార్గమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. బీసీల కులగణనలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్ల సేవలను వినియోగించుకుంటామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల సంఘాల నేతలతో విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, కర్నూలులలో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ కులగణన ఎన్నికల కోసం కాదని, మిగిలిపోయిన బీసీ వర్గాలకు ప్రత్యేక పథకాలు అవసరమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పేర్కొన్నారు.