Home » Yogi Adityanath
రాజ్యసభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీకి గట్టి దెబ్బ తగలింది. ఆ పార్టీ చీఫ్ విప్ మనోజ్ పాండే పార్టీకి రాజీనామా చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటోంది. దేశంలో పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందుకోసం కొత్త ఎత్తుగడ వేసింది.
కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష 2023ను రద్దు చేస్తూ యూపీ(UP) ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష అభ్యర్థులు నిరసన చేస్తూ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పేపర్ లీక్ కారణంగా ఉత్తర ప్రదేశ్‌లో నిర్వహించనున్న కానిస్టేబుల్ పరీక్ష రద్దు అయింది. మరో ఆరు నెలల్లో అన్ని పకడ్బందీ చర్యలు తీసుకుని మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
వారణాసిలో సెయింట్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాజకీయ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు.
ఉత్తరప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. సీఎం యోగీ ఆదిత్యనాథ్(Yogi Adityanath) నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రాష్ట్రంలో పెట్టుబడులు "రెడ్ టేప్" నుంచి "రెడ్ కార్పెట్" అనేలా మారాయని కొనియాడారు.
దేశంలో అత్యంత పాపులర్ సీఎంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలిచారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను వెనక్కు నెట్టి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆయన రెండో స్థానంలో నిలిచారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ జ్ఞానవాపిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్ఞానవాపి మసీదు లోపల ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో మంగళవారం నాడు పూజ చేశారు.
జ్ఞానవాపి మసీదుపై వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయ శిథిలాలు ఉన్నాయని పురావస్తు శాఖ సర్వే ఆధారంగా.. సెల్లార్లో హిందువులు పూజలు నిర్వహించుకోవచ్చని కోర్టు ఇచ్చిన అనుమతిపై ముస్లిం నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు బీజేపీ పట్టుదలగా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర అసెంబ్లీలో అయోధ్యలోని రామమందిరంతో పాటు మధుర, కాశీ ఆలయాల ప్రస్తావన చేశారు. అయోధ్యలోని రామాలయం రాష్ట్రానికి ఎలాంటి గుర్తింపు తెచ్చిందో సభలో వివరించారు.