Narendra Modi: రవిదాస్ జీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. కాశీ ప్రజాప్రతినిధిగా అవి నా బాధ్యతలు అన్న మోదీ
ABN , Publish Date - Feb 23 , 2024 | 01:06 PM
వారణాసిలో సెయింట్ రవిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు రాజకీయ పార్టీల గురించి కూడా ప్రస్తావించారు.
భారతదేశానికి ఒక చరిత్ర ఉందని, దేశానికి అవసరం వచ్చినప్పుడల్లా దేశంలో ఏదో ఒక సాధువు, మహర్షిగా గొప్ప వ్యక్తిత్వం పుడుతుందని ప్రధాని మోదీ(narendra modi) అభిప్రాయం వ్యక్తం చేశారు. వారణాసి(varanasi)లో సెయింట్ గురు రవిదాస్(sant ravidas) 647వ జయంతి వేడుకలకు ప్రధాని హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించిన క్రమంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో సెయింట్ రవిదాస్ జీని భక్తి ఉద్యమ గొప్ప సాధువుగా పేర్కొన్నారు. ఆయన విభజించబడిన భారతదేశానికి కొత్త శక్తిని ఇచ్చారని అన్నారు. రవిదాస్ జీ సమాజానికి స్వేచ్ఛ, ప్రాముఖ్యతను చెప్పారని గుర్తు చేశారు.
అంటరానితనం, వివక్ష వంటి వాటికి వ్యతిరేకంగా గళం విప్పారని రవిదాస్ సేవలను కొనియాడారు. ఈరోజు దేశంలోని ప్రతి వెనుకబడిన వ్యక్తి మరో విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. మన దేశంలో కుల సంక్షేమం పేరుతో కొంత మంది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు ఇక్కడి ఎంపీగా, కాశీ ప్రజాప్రతినిధిగా బనారస్(varanasi)లో మీకు స్వాగతం పలకడం నా ప్రత్యేక బాధ్యత అని మోదీ అన్నారు. దీంతోపాటు మీ అందరి బాగోగులు, మీ సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానని వెల్లడించారు. ఈరోజు వందలాది ప్రాజెక్టుల ప్రారంభోత్సవం జరగనుంది. మీ అభివృద్ధి పనులు కూడా వేగంగా జరగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath) కూడా ఉన్నారు. ప్రధాని మోదీ తన రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి చేరుకున్నారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: India vs England: తొలి మ్యాచులోనే అదరగొట్టిన ఆకాష్ దీప్.. లంచ్ బ్రేక్ వరకు 5 వికెట్లు