Share News

Constable Recruitment Exam: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023 రద్దు.. ఆరు నెలల్లో మళ్లీ ఎగ్జామ్

ABN , Publish Date - Feb 25 , 2024 | 07:37 AM

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023ను రద్దు చేస్తూ యూపీ(UP) ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంతో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష అభ్యర్థులు నిరసన చేస్తూ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Constable Recruitment Exam: కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023 రద్దు.. ఆరు నెలల్లో మళ్లీ ఎగ్జామ్

యూపీ(UP) పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించి యోగి(Yogi Adityanath) ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2023(Constable Recruitment Exam 2023) రద్దు చేయబడింది. పేపర్ లీక్ కావడంతో పరీక్షకు హాజరైన అభ్యర్థులు కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని నిరసన చేస్తూ డిమాండ్‌ చేశారు. బరేలీ డివిజన్‌లోని నాలుగు జిల్లాల్లో కూడా అభ్యర్థులు ఆందోళన నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Narendra Modi: నేడు ప్రధాని మోదీచే సుదర్శన్ సేతు వంతెన, ఐదు కొత్త ఎయిమ్స్‌లు ప్రారంభం


ఇక పేపర్ లీక్ అవుతున్న వార్తలు సంచలనం రావడంతో ఇటీవల జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేశారు. ఆరు నెలల్లో మళ్లీ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి యోగి(yogi adityanath) తెలిపారు. అంతేకాదు పేపర్ లీక్ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షల నిబద్ధత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

ఈ నేపథ్యంలో ఏ స్థాయిలో నిర్లక్ష్యం జరిగినా ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేయడం ద్వారా ముందస్తు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. కేసును ఎస్టీఎఫ్ ద్వారా దర్యాప్తు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దోషులుగా తేలిన వ్యక్తులు లేదా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇచ్చింది. ఉట్నూర్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ సేవల ద్వారా అభ్యర్థులకు ఉచిత సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Feb 25 , 2024 | 07:37 AM