Home » Yogi Adityanath
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతికి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మద్దతుగా నిలిచారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు ఉన్న పరిస్థితులు లేవు. రాజకీయంగా పెను మార్పులు జరిగాయి. దేశంలో అత్యధిక జనాధరణ కలిగిన ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై ఇండియా టుడే వార్తా సంస్థ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే చేపట్టింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టాప్ ప్లేస్‌లో ఉన్నారు.
అయోధ్యలోని సమాజావాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ (65)తోపాటు రాజు ఖాన్‌పై లైంగిక దాడి ఘటనలో పోలీసులు కేసులో నమోదు చేశారు. 12 ఏళ్ల బాలిక కడుపులో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆమె గర్బవతి అని వైద్యులు వెల్లడించారు.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్స్పై వైద్యుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి.. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీలో రెండు ఇళ్లు కూలిపోయారు. కాశీ విశ్వనాథ్ ఆలయం ఎల్లో జోన్లో ఇళ్లు కూలిపోవడం తీవ్ర కలకలం రేపింది. సిల్కో గాలి మీదుగా ఎంట్రెన్స్ 4ఏకి వెళ్లే దారిలో ఉన్న ఇళ్లు సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో నేలమట్టం అయ్యాయి. ఇళ్లు కూలిపోయామని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యల్లో ఆరోగ్యశాఖ, డాగ్ స్వ్కాడ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి.
అయోధ్యలో పన్నెండేళ్ల మైనర్ బాలికపై ఆత్యాచార ఉదంతం వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారంనాడు పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
అక్రమార్కులపై యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలు కొనసాగిస్తోంది. ఆగస్టు 2న 'అయోధ్య రేప్ కేసు'లో నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో జిల్లా యంత్రాగం శనివారంనాడు బుల్డోజర్ యాక్షన్‌కు దిగింది. ఆయన పేరుతో ఉన్న బేకరీని బుల్డోజర్తో నేలమట్టం చేసింది.
బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు-2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. సోమవారంనాడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఈరోజు సభ ఆమోదించింది.
సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ఈ సమావేశం జరిగింది.
అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారంనాడు ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక మాధ్యమ 'ఎక్స్'లో తెలిపారు. అగ్నివీరులు సర్వీసు నుంచి తిరిగి రాగానే పోలీసు సర్వీసు, పీఏసీలో ప్రాధాన్యతా క్రమంలో ఉద్యోగాకావశాలు కల్పిస్తామని చెప్పారు.