Share News

Yogi Adityanath: రాజకీయాలు నాకు ఫుల్‌టైం జాబ్‌ కాదు

ABN , Publish Date - Apr 02 , 2025 | 05:28 AM

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజకీయాలు తనకు పూర్తి కాలపు ఉద్యోగం కాదని యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. "పార్టీ నాకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించిందని", రాజకీయాలపై తన అభిప్రాయం వెల్లడించారు

Yogi Adityanath: రాజకీయాలు నాకు ఫుల్‌టైం జాబ్‌ కాదు

పార్టీ నన్ను యూపీ సీఎంగా కూర్చోబెట్టింది: యోగి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1: ఓవైపు ప్రధాని మోదీ రిటైర్మెంట్‌పై ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా తన రాజకీయ భవిష్యత్‌ గురించి మాట్లాడారు. భావి ప్రధాని మీరేనా అని మంగళవారం ఓ విలేకరి అడుగగా.. రాజకీయాలు తనకు పూర్తికాలపు ఉద్యోగం (ఫుల్‌టైం జాబ్‌) కాదని ఆయన బదులిచ్చారు. ‘నేను రాష్ట్ర సీఎంగా ఉన్నాను. ఉత్తరప్రదేశ్‌ ప్రజల కోసం పార్టీ (బీజేపీ) నన్నిక్కడ కూర్చోబెట్టింది. రాజకీయాలు నాకు ఫుల్‌టైం జాబ్‌ కాదు. వాస్తవానికి నేనో యోగిని. కానీ ఇక్కడున్నంత కాలం పనిచేస్తూనే ఉంటా. అయితే దీనికీ ఓ కాలపరిమితి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలోని 80 స్థానాలకు గాను బీజేపీ 33 సీట్లే గెలవడం.. గతం కంటే 29 తగ్గిపోవడంతో యోగిపై ఆ పార్టీ అధిష్ఠానం తీవ్ర అసంతృప్తితో ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. అధిష్ఠానంతో తనకెలాంటి విభేదాలూ లేవని యోగి స్పష్టంచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Husband Marries Wife to Lover: మళ్లీ మొదటి భర్త వద్దకు..

Horoscope 2025-2026: Horoscope 2025-2026: కొత్త సంవత్సరంలో మీ జాతక చక్రం ఎలా తిరగబోతుందో చూసుకోండి

Sri Rama Navami: Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Bengaluru Teacher: విద్యార్థి తండ్రితో అక్రమ సంబంధం.. టీచర్ అరెస్ట్

For Latest National News , National News in Telugu

Updated Date - Apr 02 , 2025 | 05:28 AM