yogi Adityanath: మోదీ తర్వాత యోగీనే ప్రధాని.. తొలిసారి స్పందించిన యూపీ సీఎం..
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:21 PM
yogi Adityanath: భారత ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలకు స్వప్తి పలకనున్నారని బాగా ప్రచారం జరుగుతోంది. ఆయన తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాని అవుతారన్న టాక్ బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే యోగీ ఆ పుకార్లపై క్లారిటీ ఇచ్చారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో రాజకీయాల నుంచి రిటైర్డ్ కాబోతున్నారంటూ గత కొద్దిరోజుల నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మోదీ చాలా ఏళ్ల తర్వాత ఆర్‌ఎస్‌ఎస్ హెడ్ క్వాటర్స్‌కు వెళ్లటంతో పుకార్లు మొదలయ్యాయి. మోదీ తర్వాత ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ ప్రధాని కాబోతున్నారన్న ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. ఈ పుకార్లపై యోగీ స్పందించారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. మోదీ రిటైర్డ్‌మెంట్, తన రాజకీయ భవిష్యత్తు గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘ చూడండి.. నేను ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని.
ఉత్తర ప్రదేశ్‌లోని పేద ప్రజలకు సేవ చేయడానికి పార్టీ నన్ను ఇక్కడ పెట్టింది. రాజకీయాలు నా ఫుల్ టైం జాబ్ కాదు. ఇప్పుడు నేను ఇక్కడ నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కేవలం యోగిని మాత్రమే. ప్రతీ దానికి ఓ నిర్థిష్ట సమయం అంటూ ఉంటుంది. నేను పార్టీ వల్లే ఇక్కడ ఉన్నాను. కేంద్ర నాయకులతో బేధాలు వస్తే.. ఇక్కడ ఉండగలుగుతానా?.. రెండో విషయం ఏంటంటే.. పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ బోర్డు కమిటీ టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయిస్తుంది. అందులో కూడా చాలా రకాలుగా వడపోతలు ఉంటాయి. ఊసుపోక మాట్లాడేవారు మాట్లాడుతూనే ఉంటారు. ఆ నోళ్లను ఆపలేము కదా.. ’
అంటూ స్పష్టంగా తాను చెప్పాలనుకున్నది చెప్పేశారు. కాగా, యోగీ ఆధిత్యనాథ్ గత తొమ్మిదేళ్లుగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎక్కువ సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిగా రికార్డుకు సైతం ఎక్కారు. యోగీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత లా అండ్ ఆర్డర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. తప్పు చేసే వాళ్ల తాట తీస్తున్నారు. బుల్ డోజర్లకు పని చెబుతున్నారు. అందుకే ఆయన్ని బుల్ డోజర్ మంత్రి అని పిలుస్తున్నారు. యోగీ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గాయి.
ఇవి కూడా చదవండి:
Heat Waves: ఇక రెడీ అవ్వండి.. లేదంటే దబిడి దిబిడే..
Virat Kohli: ఐపీఎల్ ట్రోఫీ కాదు.. కోహ్లీ నెక్స్ట్ టార్గెట్ తెలిస్తే మైండ్‌బ్లాంక్