Home » Yogi Adityanath
లోక్సభ ఎన్నికల ఫలితాల అనంతరం యూపీ బీజేపీలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయన్న ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ ఏర్పాటు చేసిన సమావేశాలకు డిప్యూటీ ముఖ్యమంత్రులు గైర్హాజర్ కావడం చర్చనీయాంశమవుతోంది.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు సమాజ్వాదీ పార్టీకి సంతోషానిచ్చాయి. వూహించినదానికంటే ఎక్కువ సీట్లు రావడం, బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఓడిపోవడంతో కమలం బలం తగ్గుతుందని.. ఎస్పీ బలం పెరుగుతుందనే అంచనాకు అఖిలేష్ యాదవ్ వచ్చినట్లు తెలుస్తోంది.
2024-2025 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం సభకు ప్రకటించారు. నిర్మల పద్దుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి లక్ష్యంగా పద్దు రూపొందించారని వివరించారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని ప్రశంసించారు.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరి చేస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై దూమారం రేగుతున్న నేపథ్యంలో యూపీ బాటలో నడించేందుకు మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ పావులు కదుపుతోంది. ఈ విషయాన్ని ఛత్తీస్గఢ్ యువజన సంక్షేమ, రెవెన్యూ శాఖ మంత్రి టాంక్ రామ్ వర్మ ధ్రువీకరించారు.
ఉత్తరప్రదేశ్లో కావడి యాత్ర సాగే మార్గంలో అన్ని తినుబండారాల దుకాణాలపై వాటి యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాల్సిందేనని సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పష్టం చేశారు.
కన్వర్ యాత్ర సాగే మార్గంలో హోటల్ యజమానులు, సిబ్బంది పేర్లు తప్పక ప్రదర్శించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు.
ఏటా లక్షలాది మంది శివభక్తులు పాల్గొనే 'కన్వర్ యాత్ర' రూటులో తినుబండారాలకు సంబంధించి ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారంనాడు ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. తినుబండారాల దుకాణాల వద్ద యజమానులు, సిబ్బంది పేర్లు తప్పనిసరిగా ఉండాలని సీఎం ఆదేశించారు.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించవచ్చునని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
ఉత్తరప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్..
రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయాలు సాధించినంతవరకూ అంతా బాగున్నట్టే అనిపిస్తుంది! కానీ.. ఒక్కసారి ఓటమి ఎదురైతే.. పార్టీల్లో లోపాలు, అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడతాయి.