Yogi Adityanath: యోగి రికార్డు.. యూపీలో 85 శాతం తగ్గిన హత్యలు, అత్యాచారాలు
ABN , Publish Date - Mar 30 , 2025 | 08:50 PM
పోలీసు రికార్డుల ప్రకారం యూపీలో 2016తో పోలిస్తే గత ఎనిమిదేళ్లలో దొంగతనాల ఘటనలు 84.41 శాతం తగ్గాయి. లూటీలు 77.43 శాతం తగ్గాయి. కిడ్నాప్‌లు, కట్నాలకు సంబంధించిన హత్యలు, అత్యాచారాలు సైతం ఇదే శాతంలో తగ్గాయి.

లక్నో: యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో గత ఎనిమిదేళ్లలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగైంది. దోపిడీలు, దొంగతనాలు, అల్లర్లు, హత్యలు, అపహరణలు, అత్యాచారాల వంటి ఘోరనేరాలు (heinous crimes) 85 శాతం తగ్గాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారంనాడు ఒక ప్రకటనలో ఈ వివరాలు తెలిపింది.
AFSPA: మణిపూర్‌పై కేంద్రం కీలక నిర్ణయం
పోలీసు రికార్డుల ప్రకారం యూపీలో 2016తో పోలిస్తే గత ఎనిమిదేళ్లలో దొంగతనాల ఘటనలు 84.41 శాతం తగ్గాయి. లూటీలు 77.43 శాతం తగ్గాయి. కిడ్నాప్‌లు, కట్నాలకు సంబంధించిన హత్యలు, అత్యాచారాలు సైతం ఇదే శాతంలో తగ్గాయి. నేరాలు, ఘోరాలకు, పాల్పడేవారిని, శాంతి భద్రతలను దెబ్బతీసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడం, సీసీటీవీల ఏర్పాటు వంటి అధునాతన నిఘా టెక్నిక్‌లు ఉపయోగించడం వంటివి సత్ఫలితాలను ఇచ్చాయి. నేరస్థులను పట్టుకునేందుకు ఈ విధానాలు దోహడపడినట్టు ప్రభుత్వం ఆ ప్రకటనలో తెలిపింది.
మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, భూ ఆక్రమణదారులపై యోగి సర్కార్ కొరడా ఝలిపించింది. రూ.142 కోట్లు విలువచ చేసే అక్రమ ఆస్తులను సీజ్ చేసింది. 68 మంది మాఫియా లీడర్లు, వారి అసోసియేట్లు 1,500పై కేసులు నమోదు చేసింది. 617 మంది క్రిమినల్స్‌ను అరెస్టు చేసింది. 752 అఫెండర్లపై గ్యాంగ్‌స్టర్ చట్టం అమలు చేసింది.
ఇవి కూడా చదవండి..
PM Modi: రూ.33,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
Amit Shah: జంగిల్‌రాజ్ కావాలో డవలప్‌మెంట్ అవసరమో తేల్చుకోండి... షా పిలుపు
Nodia Porn Racket: లక్షల్లో జీతం, లగ్జరీ లైఫ్ పేరుతో వల.. వెలుగులోకి పోర్న్ రాకెట్
Yatnal: కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా
For National News And Telugu News