Share News

Mk Stalin: కామెడీ చేయటం మానుకోండి.. యోగిపై స్టాలిన్ ఫైర్..

ABN , Publish Date - Mar 27 , 2025 | 12:20 PM

Mk Stalin Fires Back on Yogi: తమిళనాడు సీఎం, డీఎంకే నాయకుడు స్టాలిన్ ఉత్తరప్రదేశ్ యోగి వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. తమిళనాడు ఏ భాషను వ్యతిరేకించదని, బలవంతంగా ప్రజలపై త్రిభాషా విధానాన్ని రుద్దేందుకు ప్రయత్నిస్తున్న మీ దురహంకార వైఖరినే మా పోరాటమని స్పష్టం చేశారు.

Mk Stalin: కామెడీ చేయటం మానుకోండి.. యోగిపై స్టాలిన్ ఫైర్..
MK Stalin-Yogi Adityanath

Mk Stalin Fires Back on Yogi: త్రిభాషా సూత్రాని(three-language row)కి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి వైఖరి సరిగా లేదంటూ ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా విమర్శించారు. ఇందుకు వెంటనే తనదైన శైలిలో సమాధానం చెప్పారు స్టాలిన్. ఆయన మాటలు వ్యంగ్యంగా లేవని పొలిటికల్ బ్లాక్ కామెడీ చేస్తున్నట్లుగా ఉన్నాయంటూ ఘాటుగా జవాబిచ్చారు. తమిళనాడు ఎప్పుడూ ఏ భాషను వ్యతిరేకించదని, కానీ అహంకారంతో బలవంతంగా మీ విధానాలకు రుద్దేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ మా పోరాటానికి జడిసి ఇలా మాట్లాడుతోందని అన్నారు.


DMKవి ఓటు బ్యాంకు రాజకీయాలు : సీఎం యోగి

ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి DMK నాయకుడిని లక్ష్యంగా చేసుకుని ఇలా అన్నారు. ఎన్నికల ముందు ఓటు బ్యాంకు ఎక్కడ కోల్పోతామో అనే భయాందోళనలతోనే ప్రాంతీయ, భాషా విభేదాలను సృష్టించేందుకు సీఎం స్టాలిన్ ప్రయత్నిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సంస్కృతం తర్వాత అత్యంత పురాతనమైన తమిళంపై మాకు గౌరవం ఉంది. కానీ హిందీని ఇంతలా ద్వేషించడం ఎందుకు. ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయాల్లో తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం తదితర భాషలు బోధిస్తున్నపుడు తమిళనాడులో హిందీ బోధిస్తే తప్పేంటని ప్రశ్నించారు. హోంమంత్రి ఈ విషయంపై స్పష్టంగా మాట్లాడిన తర్వాత రాజకీయ ఎజెండాతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించడం సమంజసం కాదని అన్నారు. డీఎంకే పార్టీవి సంకుచిత రాజకీయాలని మండిపడ్డారు.


దేశాభివృద్ధికి కృషి చేసిన రాష్ట్రాలకు ఇదా బహుమానం : డీఎంకే

కేంద్రం జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ)లో త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టడాన్ని డీఎంకే ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై బలవంతంగా హిందీని రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. 2026 తర్వాత డీలిమిటేషన్ అమల్లోకి వస్తే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలేనని వాదిస్తోంది. దశాబ్దాల తరబడి కుటుంబ నియంత్రణ సమర్థంగా అమలు చేసి దేశ జీడీపీ పెరిగేందుకు కృషి చేసినందుకు ఫలితంగా దక్షిణాది వారికి పార్లమెంటులో ప్రాధాన్యత తగ్గడమే బహుమానంగా లభిస్తోందని ఎండగట్టింది.


ఎక్స్‌ లో తమిళనాడు సీఎం స్టాలిన్ చేసిన పోస్ట్‌లో, "రెండు భాషలు, డీలిమిటేషన్ పై తమిళనాడు వైఖరిని దేశవ్యాప్తంగా సమర్థిస్తున్నారు. బీజెపి పార్టీ తీరుపై విరుచుకుపడుతున్నారు. ఈ సమయంలో గౌరవనీయులైన యోగి ఆదిత్యనాథ్ ద్వేషం గురించి మాకు ఉపన్యాసాలు ఇవ్వాలనుకుంటున్నారా? మమ్మల్ని వదిలేయండి. ఇది వ్యంగ్యం కాదు. పొలిటికల్ బ్లాక్ కామెడీ చీకటి దశలో ఉంది. మేము ఏ భాషను వ్యతిరేకించము. బలవంతంగా రుద్దడాన్ని, దురభిమానాన్ని వ్యతిరేకిస్తాము. ఇది ఓట్ల కోసం అల్లర్లు సృష్టించేందుకు చేసే రాజకీయాలు కాదు. గౌరవం, న్యాయం కోసం జరుగుతున్న యుద్ధం" అని ఆయన అన్నారు.


Read Also : Uber Olas New Competitor: ఓలా, ఉబర్‌‌లకు షాక్.. కేంద్రం కొత్త యాప్.. ఇక డ్రైవర్లకు పండగే

Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ కారుకు ప్రమాదం.. ఆందోళనలో ఫ్యాన్స్

భర్త బంపరాఫర్: 'పిల్లలను నేను పెంచుతాను రాధిక.. నీ లవర్‌‌ని పెళ్లి చేసుకో'

Updated Date - Mar 27 , 2025 | 12:49 PM