Home » Yogi Adityanath
గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ (Mukthar Ansari) సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అప్జల్ అన్సారీ ఆయన అన్న మృతిపై సంచలన ప్రకటన చేశారు. ముఖ్తార్ అన్సారీ కథ సుఖాంతమైందని ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం ఆలోచిస్తోందని అఫ్జల్ పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీకి బీజేపీ (BJP) ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించింది. ఈ స్థానం నుంచి ఉత్తరప్రదేశ్ మంత్రి జితిన్ ప్రసాద్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. దీనిపై వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi) తొలిసారి స్పందించారు.
ఉత్తర్ ప్రదేశ్(uttar pradesh)లో కరుడుగట్టిన మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ(mukhtar ansari) గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఇవాళ ఆయన స్వగ్రామమైన యూపీలోని ఘాజీపూర్(ghazipur)లో కట్టుదిట్టమైన భద్రత మధ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన భౌతికకాయాన్ని శనివారం ఉదయం ఘాజీపూర్‌కు తరలించారు.
రాజ్యాంగం(constitution) కంటే షరియత్(Shariat law) పెద్దది కాదని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో(india) ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఆయన సారథ్యం వహించనున్నారు. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే మధుర నుంచి ప్రచారం ప్రారంభించి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరచనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రధాని ఉత్తర్ ప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాకు చేరి రూ.34,700 కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని మంగళవారంనాడు విస్తరించారు. కొత్తగా నలుగురిని మంత్రులుగా తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు.
అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తాము చేస్తోంది తప్పా? ఒప్పో? అనేది పట్టించుకోకుండా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిది కూడా ఇదే పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (PM Narendra Modi) పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను (CM Yogi Adityanath) చంపేస్తానని అతడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్పర్సన్ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించారు.